హౌతీలపై వైమానిక దాడి.. ఇంధనం అందకుండా.. వీడియో
హౌతీ రెబెల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాలను ద్వంసం చేయాలనే ఉద్దేశంతో దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. యెమెన్ లోని ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేదని హౌతీల ఆదాయ వనరులను దెబ్బతీయాలనే దాడులు చేసినట్లు చెప్పింది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య యుద్ధ నౌకలపై హౌతీలు దాడులు ఆపాలనే లక్ష్యంతో అమెరికా సైనిక చర్యను మొదలుపెట్టింది. హౌతీలు ఇకపై దాడులు ఆపాలని లేకుంటే నరకం చూపిస్తామని గతంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హౌతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్ కు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. హౌతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సముద్ర జలాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్ళకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని తెలియజేశారు. గాజాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను 2013 నుంచి లక్ష్యంగా చేసుకున్నారు. 2013 నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలే లక్ష్యంగా 174 సార్లు, వాణిజ్య నౌకలే లక్ష్యంగా 145 సార్లు దాడులు చేశారని పెంటగన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
