Solar Panels: సోలార్‌తో ఏసీని నడపవచ్చా..? ఎంత కెపాసిటీకి ఎన్ని ప్యానెల్స్ అవసరం..!
Solar Panels: సోలార్ ప్యానెల్‌తో AC నడపడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. మీరు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, సోలార్ ప్యానెల్ సామర్థ్యం సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రోజంతా ఏసీని నడపడానికి బ్యాటరీ బ్యాకప్ లేదా గ్రిడ్ కనెక్షన్ కూడా అవసరం కావచ్చు..

భారతదేశంలో ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లోనే ఢిల్లీ వంటి నగరాల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇప్పుడే ఇలా ఉంటే మే-జూన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడటం మొదలుపెట్టారు. కానీ దీనితో విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుంది. అది కూడా జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏసీ ఉపయోగిస్తున్నప్పటికీ విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి అవుననే సమాధానం వస్తుంది నిపుణుల నుంచి. అది కూడా సోలార్ ప్యానల్ ద్వారా.
సోలార్ ప్యానెల్స్ ఏసీని నడపగలవా?
సోలార్ ప్యానెల్‌తో AC నడపడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. మీరు సోలార్ ప్యానెల్స్‌తో ACని మాత్రమే కాకుండా మీ మొత్తం ఇంటికి సరిపడే విద్యుత్‌ను కూడా అందించవచ్చు. కానీ దీని కోసం మీ ఏసీ టన్నుల సామర్థ్యం ఎంత? దీనిని బట్టి ఎన్ని సోలార్ ప్యానెల్‌లు అవసరమో మీరు తెలుసుకోవడం ముఖ్యం.
1 టన్ను ఏసీకి ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం?
మీరు 1 టన్ను ఎయిర్ కండిషనర్ (AC)ని నడపాలనుకుంటే అది సాధారణంగా గంటకు 1200 నుండి 1500 వాట్ల (అంటే 1.2 నుండి 1.5 కిలోవాట్ల) విద్యుత్తును వినియోగిస్తుంది. అంటే ప్రతి గంటకు ఏసీ 1.2 నుండి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ఈ వినియోగాన్ని తీర్చడానికి మీకు దాదాపు 250 వాట్ల సామర్థ్యం గల 6 సౌర ఫలకాలు అవసరం. ఎందుకంటే 250 వాట్స్ 6 ప్యానెల్స్ = 1500 వాట్స్ (1.5 కిలోవాట్లు).
1.5 టన్నుల ఏసీకి ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం?
అదేవిధంగా మీ ఎయిర్ కండిషనర్ 1.5 టన్నులు ఉంటే అది గంటకు 2000 నుండి 2200 వాట్ల (2 నుండి 2.2 kW) విద్యుత్తును వినియోగిస్తుంది. దీని ప్రకారం, 1.5 టన్నుల ACని నడపడానికి, మీరు దాదాపు 9 నుండి 10 సోలార్ ప్యానెల్‌లను (250 వాట్స్) ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
2 టన్నుల ఏసీకి ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం?
మీరు 2 టన్నుల ఏసీ ఉపయోగిస్తుంటే, అది గంటకు 2800 నుండి 3000 వాట్ల (2.8 నుండి 3 కిలోవాట్ల) విద్యుత్తును వినియోగిస్తుంది. ఈ వినియోగాన్ని తీర్చడానికి, 250 వాట్ల 12 నుండి 13 సోలార్ ప్యానెల్స్ అవసరం.
ఏసీ సామర్థ్యం 3 టన్నులు అయితే?
3 టన్నుల ఏసీ సాధారణంగా 3500 వాట్స్ (3.5 KW) వరకు విద్యుత్తును వినియోగిస్తుంది. దానిని నడపడానికి 14 నుండి 15 సోలార్ ప్యాలెన్స్ అవసరం. అయితే మీరు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, సోలార్ ప్యానెల్ సామర్థ్యం సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రోజంతా ఏసీని నడపడానికి బ్యాటరీ బ్యాకప్ లేదా గ్రిడ్ కనెక్షన్ కూడా అవసరం కావచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
