తలుపు చాటున ఇద్దరమ్మాయిల యవ్వారం.. సిరీస్ మాత్రం అరాచకం

Phani CH

25 April 2025

Credit: Instagram

ఓటీటీల జమానా పెరిగిన తర్వాత విభిన్నమైన కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

అలా అషూరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఓ సిరీస్ ఇప్పుడు పెద్దగా ఆర్భాటం లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇంతకీ ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? దీని కథేంటి?

సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న అషూరెడ్డి.. గత కొన్నాళ్లుగా సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ సిరీస్ 'ఎవరు ఎ‍ప్పుడు ఎక్కడ'.

పీఎస్ రావు అనే దర్శకుడి దీన్ని తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ లో అషూతో పాటు ధన్య బాలకృష్ణ, కౌశల్, ఆటో రాంప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు.

'ఎవరు ఎప్పుడు ఎక్కడ' సిరీస్ తెలుగు వెర్షన్ తో పాటు హిందీలోనూ హంగామా ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సిరీస్ విషయానికొస్తే.. ఎమ్మెల్యే దగ్గర పనిచేసే పీఏ ఒకరు చనిపోతారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సాక్షులు కూడా చనిపోతుంటారు.

ఇదంతా ఓ అమ్మాయి చేస్తుందని పోలీసులు తేలుస్తారు. ఇంతకీ మర్డర్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.