TV9 Telugu
25th April 2025
ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ లెక్కలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్ 4 కోసం 6 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఐపీఎల్ 2025ను నెమ్మదిగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు తన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కూడా చిత్తుగా ఓడించాడు.
ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ అర్ధ శతకం సాధించాడు. దీంతో 9 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది.
2016 ఐపీఎల్ సీజన్ తర్వాత రోహిత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు.
రోహిత్ కూడా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ ఈ 12000 పరుగులను 8885 బంతుల్లో పూర్తి చేయగా, కోహ్లీ 8997 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
ముంబై తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన కీరన్ పొలార్డ్ (258) రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.