AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ.. ఇదేం పాడుపని! కాలేజ్‌ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!

ఘట్‌కేసర్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ వీబీఐటీ హాస్టల్‌లో విద్యార్థినుల స్నానపు వీడియోలు రికార్డ్ చేసినట్లు ఆరోపణలు. వార్డెన్, సిబ్బందిపై అనుమానాలు. విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Hyderabad: ఛీ.. ఇదేం పాడుపని! కాలేజ్‌ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!
Vbit
SN Pasha
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 25, 2025 | 6:07 PM

Share

కాలేజీ అంటే విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే దేవాలయాలు. అలాంటి చోటుకి తమ కన్నబిడ్డలను తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా పంపిస్తూ ఉంటారు. ఇక ఇంజనీరింగ్‌ చదివించాలంటే.. ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో తమ పిల్లలను ఉంచాల్సిందే. అలాగే కొన్ని కాలేజీల్లో అమ్మాయిల హాస్టల్స్‌ కూడా ఉంటాయి. వాటినే విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా నమ్ముతారు. తమ పిల్లలను అక్కడే ఉంచి చదివిస్తుంటారు. కానీ, కొంతమంది కామాంధులు, దుర్మార్గులు.. హాస్టల్స్‌లో ఉండే అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియోలను రికార్డ్‌ చేస్తూ శునాకానందం పొందుతుంటారు.

గతంలో కూడా ఇలా ఘటనలు సంచలనం సృష్టించాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఇలాంటి ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. అది కూడా ఓ ప్రముఖ కాలేజీ హాస్టల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా వారి వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ వీబీఐటీలో చోటు చేసుకుంది. కాలేజీ అమ్మాయిలు వారి హాస్టల్స్‌లో స్నానాలు చేస్తున్న సమయంలో హాస్టల్‌ వార్డెన్, స్టాఫ్, లెక్చరర్లు వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

దీంతో ఒక్కసారిగా కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా చోట్ల కొన్ని కాలేజీ హాస్టల్స్‌లో అమ్మాయిల వీడియోలను రికార్డ్‌ చేసిన ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయం హాస్టల్‌లోని విద్యార్థినులతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. అలాగే పోలీసులకు కూడా ఇంకా ఫిర్యాదు అందలేని సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి