పెళ్లికి ఒక్క రోజు ముందు మామకు షాకిచ్చిన వరుడు వీడియో
ఇటీవల ఉత్తర ప్రదేశ్ మెహరట్ లో కాబోయే అల్లుడితో ఓ మహిళ వెళ్ళిపోతే కూతురు మామతో పరారైంది మరో మహిళ. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మరో విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కతో నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి ఒక రోజు ముందు అక్కతో పెళ్లి క్యాన్సిల్, చెల్లితో అయితే ఒకే అని మామకు ఫోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఏం చేసేదిరా దేవుడా అంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ మామగారు. మధ్యప్రదేశ్ లోని రివార్ జిల్లా మంగవాకు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్ 18 న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు.
ఏప్రిల్ 16న వధూవరులకు నిశ్చితార్థం జరిపించారు. ఈ తిలకోత్సవం ఎంతో ఘనంగా జరిపించి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలో పెళ్లికి ఒకరోజు ముందు వరుడు కాబోయే మామగారికి ఫోన్ చేసి మీ పెద్ద అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. మీ చిన్న కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. ఈ మాట విన్న వధువు తండ్రి షాకయ్యాడు. విషయం తెలిసి వధువు ఆత్మహత్య యత్నం చేసింది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చర్చగా కోలుకుంటోంది. కాగా ఆమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు మరోసారి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ తెలిపారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
