Coronavirus: కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు.. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్..
కరోనా ధాటికి రాజకీయ ప్రముఖులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే
కరోనా ధాటికి రాజకీయ ప్రముఖులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని అందులో పేర్కొంది. ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకా తీసుకున్నారని, అయితే ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు ఇంకా అర్హులు కాలేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కాగా కొవిడ్ బారిన పడిన మల్లికార్జున ఖర్గే గత రెండురోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ముంచిన మేకెదాటు మార్చ్..
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గే పాల్గొన్నారు. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 10 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. ఇందులో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డి వైరస్ బారిన పడ్డారు. కాగా ఈ ర్యాలీకి సారథ్యం వహించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కరోనా నిర్ధారణ పరీక్షకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
Also Read:
Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్ బారిన పడిన మెదక్ ఎమ్మెల్యే..
Lovlina Borgohain: కొత్త బాధ్యతల్లో ఒలింపిక్ మెడలిస్ట్.. అసోం డీఎస్పీగా యంగ్ బాక్సర్..
Coronavirus: దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఏకంగా రెండున్నర లక్షలకు చేరువగా..