Covid-19: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్!

కరోనావైరస్ థర్డ్ వేవ్ ఎవరిని వదలడం లేదు. కొత్త వేరియంట్ రూపంలో దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ను తాకింది.

Covid-19: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్!
Kidambi Srikanth
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 13, 2022 | 11:47 AM

India open badminton Players Corona: కరోనావైరస్ థర్డ్ వేవ్ ఎవరిని వదలడం లేదు. కొత్త వేరియంట్ రూపంలో దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ను తాకింది. ఈ వైరస్ కారణంగా భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ షట్లర్లందరూ భారతీయులేనని అధికారులు చెప్పారు. దీంతో ఆటగాళ్లందరూ ఈ టోర్నీ నుండి నిష్క్రమించారు. ఈ ఆటగాళ్లకు మంగళవారం RT-PCR పరీక్ష జరిగింది. దీనిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధికారిక సమాచారం ఇచ్చింది. దీంతో ఈ ఆటగాళ్ల ప్రత్యర్థులు తదుపరి రౌండ్‌కు వాకోవర్ పొందుతారు.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కరోనా కలకలం సృష్టించింది. బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కరోనా సోకడం ఇదే మొదటిసారి కాదు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, బి. సాయి ప్రణీత్, ధ్రువ్ రావత్ పాజిటివ్ రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంగ్లండ్ జట్టు కూడా టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ఆ తర్వాత టోర్నమెంట్‌ ఆడుతున్న పలువురు ఆటగాళ్లు వైరస్ బారినపడుతున్నారు.

కరోనా సోకిన ఆటగాళ్లుః

కిదాంబి శ్రీకాంత్ అశ్విని పొన్నప్ప రితికా రాహుల్ థాకర్ తెరెసా జాలీ సిమ్రాన్ అమన్ సింగ్ ఖుషీ గుప్తా మిథున్ మంజునాథ్

ఇదిలావుంటే, గత సీజన్‌లో ఆడలేకపోయిన సైనా నెహ్వాల్‌ను ఈసారి టోర్నీలో పాల్గొంటున్నారు. ఆమె రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తన ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి తెరెజా స్వాబికోవా రిటైర్మెంట్‌తో వెనుదిరగడంతో సైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

Read Also… Omicron Alert: బీ అలర్ట్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో వారికి ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!