Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..
Padma Devender Reddy
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2022 | 11:49 AM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్‌‌ఎస్‌ మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలంటూ పద్మా దేవేందర్‌ రెడ్డి కోరారు. కాగా ఇటీవల టీఆర్ఎస్ నేతలు వరుసగా వైరస్‌ బారిన పడుతున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఇటీవల కరోనా బాధితుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే . తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో నిరంతరం బిజీగా ఉండే నేతలు కరోనా బారిన పడుతుండడంతో శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతండడంతో ఇప్పటికే వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. ఆదివారం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే