Lovlina Borgohain: కొత్త బాధ్యతల్లో ఒలింపిక్ మెడలిస్ట్.. అసోం డీఎస్పీగా యంగ్ బాక్సర్..
తేడాది జరిగిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది యంగ్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహిళల బాక్సింగ్
గతేడాది జరిగిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది యంగ్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో ఏకంగా రజత పతకం సాధించింది. సెమీస్ లో కూడా వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. అయితే ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది. కాగా రజత పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన లవ్లీనా.. మేరీకామ్, విజేందర్ సింగ్ తర్వాత ఒలింపిక్స్ లో పతకం సాధించిన మూడో బాక్సర్ గా లవ్లీనా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా ఒలింపిక్ పతకంతో భారత ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన లవ్లీనా తాజాగా డీఎస్పీగా నియమితురాలైంది. ఈమేరకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. దీంతో పాటు యంగ్ బాక్సర్ కు కోటి రూపాయల నజరానా కూడా ప్రకటించారు.
అసోం డీఎస్పీగా..
23 ఏళ్ల లవ్లీనా మొదట కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. 2018, 2019 ఏఐబీఏ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకం గెలిచింది. ఆతర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో స్వర్ణ పతకం సాధించింది. ఆపై గువహటిలో జరిగిన ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో రజత పతకం సాధించింది. ఈక్రమంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించి రజత పతకం సొంతం చేసుకుంది.
నా ఏకైక లక్ష్యమిదే..
కాగా డీఎస్పీగా నియమితులైనందుకు ఎంతో గర్వంగా ఉందని లవ్లీనా పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సర్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను డీఎస్పీ పదవిలో ఉన్నా నా దృష్టి మాత్రం బాక్సింగ్ పైనే ఉంటుంది. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో దేశానికి బంగారు పతకం తీసుకురావడమే నా ఏకైక లక్ష్యం’ అని పేర్కొంది లవ్లీనా.
View this post on Instagram
Also Read:
Coronavirus: దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఏకంగా రెండున్నర లక్షలకు చేరువగా..
Knowledge: గబ్బిలాల ద్వారా వైరస్‌ల సంక్రమణ.. మరి అవెందుకు జబ్బు పడవంటే..
Coronavirus: క్రీడల కోసం ఇంతటి క్రూర నిబంధనలా.. విస్తుగొలుపుతోన్న చైనా కరోనా ఆంక్షలు..