MK STALIN VICTORY: సుదీర్ఘ నిరీక్షణకు తెర… 14 ఏళ్ళ ప్రాయంలో కన్న కల.. 68 ఏళ్ళ వయసులో తీరుతోంది!

తండ్రి రాజకీయ గమనం కోసం సుదీర్ఘ కాలం సర్వ సైన్యాధ్యక్షునిగా వుండిపోయిన ఎంకే స్టాలిన్ కల ఎట్టకేలకు 68 ఏళ్ళ వయసులో నెరవేరబోతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష డిఎంకే ఘన విజయానికి బాటలు వేసిన స్టాలిన్...

MK STALIN VICTORY: సుదీర్ఘ నిరీక్షణకు తెర... 14 ఏళ్ళ ప్రాయంలో కన్న కల.. 68 ఏళ్ళ వయసులో తీరుతోంది!
Tamilnadu
Follow us

|

Updated on: May 02, 2021 | 4:05 PM

MK STALIN TAMILNADU CHIEF MINISTER: తండ్రి రాజకీయ గమనం కోసం సుదీర్ఘ కాలం సర్వ సైన్యాధ్యక్షునిగా వుండిపోయిన ఎంకే స్టాలిన్ (MK STALIN) కల ఎట్టకేలకు 68 ఏళ్ళ వయసులో నెరవేరబోతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (TAMILNADU ASSEMBLY ELECTIONS 2021) విపక్ష డిఎంకే (DMK) ఘన విజయానికి బాటలు వేసిన స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి (TAMILNADU CHIEF MINISTER)గా బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమే. కరుణానిధి (KARUNANIDHI) తనయునిగా రాజకీయ తెరంగేట్రం చేసిన స్టాలిన్ ఆయన బతికకున్నంత కాలం పార్టీ సర్వసైన్యాధ్యక్షునిగానే వుండిపోయారు. 94 ఏళ్ళ వయసులో తమిళనాడు కురువృద్ధ నేత కరుణానిధి (KARUNANIDHI DEATH) మరణించే దాకా ఆయన అనుంగు సైన్యాధ్యక్షునిగా వుండిపోయిన స్టాలిన్ తండ్రి మరణానంతరమే పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో చేపట్టారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే విజయానికి బాటలు వేసిన స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

1953 మార్చి ఒకటిన అప్పటి మద్రాస్ (MADRAS).. ప్రస్తుత చెన్నై (CHENNAI)లో జన్మించిన ఎంకే స్టాలిన్… 1967లో పద్నాలుగేళ్ళ వయసులో పార్టీ పనుల్లో పాలుపంచుకున్నారు. 1967 ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు స్టాలిన్. అప్పటికే తమిళనాడు (TAMILNADU) ఉద్ధండ రాజకీయ నేతగా కరుణానిధి ఎదిగారు. చలన చిత్ర రంగంలోను తనదైన పంచ్ డైలాగులు రాస్తూ కరుణానిధి ద్విపాత్రాభినయం చేసేవారు. 1967లో ప్రచారం నిర్వహించిన తర్వాత పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్న స్టాలిన్‌ను 20 ఏళ్ళ వయసులోనే డిఎంకే పార్టీ జనరల్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేశారు కరుణానిధి. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోను తండ్రి కరుణానిధి చేయి వీడని పార్టీ వర్కర్‌గా వుంటూనే.. తండ్రి చాటు నేతగా క్రమంగా ఎదుగుతూ వచ్చారు. ముగ్గురు భార్యలున్న కరుణానిధికి మరికొందరు సంతానం వున్నా.. స్టాలిన్ తనదైన శైలిలో కరుణానిధి అసలు సిసలు వారసునిగా పార్టీ మీద పట్టు సాధించారు. దక్షిణ తమిళనాడు (SOUTH TAMILNADU) మీద పట్టుందని పంతం పట్టిన సోదరుడు అళగిరి (ALAGIRI)ని వదిలేసుకున్నా.. తన సత్తా ఏంటో చాటుతూ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే కాకుండా.. తన చిరకాల స్వప్నమైన సీఎం (CM) సీటును కూడా చేరుకోబోతున్నారు స్టాలిన్.

1996 నుంచి ఆరేళ్ళ పాటు 2002 దాకా స్టాలిన్ చెన్నై నగర మేయర్‌ (CHENNAI CITY MAYOR)గా వ్యవహరించారు. 1989 నుంచి ధౌసెండ్‌ లైట్స్ (THOUSAND LIGHTS) నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎంకే స్టాలిన్‌ .. 2009 నుంచి రెండేళ్ళ పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (DEPUTY CHIEF MINISTER)గా వ్యవహరించారు. ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓటమి పాలైంది. అప్పట్నించి రెండు విడతలపాటు విపక్షానికే డిఎంకే పార్టీ (DMK PARTY) పరిమితమైంది. 2013 జనవరి 3న తన రాజకీయ వారసుడిగా కరుణానిధి స్టాలిన్‌ పేరును ప్రకటించారు. 2017 జనవరి 4వ తేదీన డిఎంకే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటు (DMK WORKING PRESIDENT)గా స్టాలిన్‌ను నియమించారు. తదనంతర పరిణామాలలో ఒకే ఏడాది వ్యవధిలో తమిళ రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత (JAYALALITA) మరణించారు. తమిళనాడు రాజకీయాలలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కరుణానిధి, జయలలిత బతికున్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేందుకు సైతం జంకిన కమల్ హాసన్ (KAMAL HASSAN) లాంటి వారు ఏకంగా పార్టీలు పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడ్డారు. ఫలితంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో పార్టీలు, నాలుగు కూటమిలు ఎన్నికల బరిలో నిలిచాయి.

అయితే… విపక్షాలు పెరిగిపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు చీలి… అధికార అన్నా డిఎంకే (ANNA DMK)కు లాభిస్తుందని, వరుసగా మూడో సారి అన్నా డిఎంకే అధికారం చేపట్టే అవకాశం వుందని కొందరు జోస్యం చెప్పారు. ఎలాగైనా తమిళనాడులో పాగా వేయాలని అన్ని రకాల వ్యూహాలను అమలు పరిచింది బీజేపీ (BJP). బీజేపీ ప్రాపకంతో మూడోసారి అధికారాన్ని పొందాలని అన్నా డిఎంకే (AIADMK) ఎత్తు వేసింది. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకుని అందలం ఎక్కుదామనుకున్నారు సినీ నటులు కమల్ హాసన్, శరత్ కుమార్ తదితరులు..  కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చక్రం తిప్పిన స్టాలిన్ డిఎంకే విజయానికి బాటలు వేశారు. కాంగ్రెస్ (CONGRESS), లెఫ్ట్ పార్టీలను (LEFT PARTIES) కలుపుకుని ఎన్నికల బరిలో నిలిచిన డిఎంకే.. స్పష్టమైన మెజారిటీతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు కూడా రంగం రెడీ అవుతోంది.

ALSO READ: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!

ALSO READ: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్

Latest Articles
మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ నేతలు
మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ నేతలు
ఆహా.. ఈ పాల బిజినెస్ పెట్టుకుంటే లైఫ్ సెట్.. లీటర్ 2 వేలు
ఆహా.. ఈ పాల బిజినెస్ పెట్టుకుంటే లైఫ్ సెట్.. లీటర్ 2 వేలు
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష వాయిదాపై TSPSC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష వాయిదాపై TSPSC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
అలర్ట్‌.. జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?
అలర్ట్‌.. జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?
స్టేడియంలో కావ్యా మారన్ కన్నీరుమున్నీరు.. ధైర్యం చెప్పిన అమితాబ్
స్టేడియంలో కావ్యా మారన్ కన్నీరుమున్నీరు.. ధైర్యం చెప్పిన అమితాబ్
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పైచదువులకోసం వెళ్లి.. విగతజీవిగా..
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పైచదువులకోసం వెళ్లి.. విగతజీవిగా..
భార్య వల్లే ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్.. అసలు రీజన్ ఇదే
భార్య వల్లే ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్.. అసలు రీజన్ ఇదే
మీ పెట్టుబడికి గ్యారంటీ రాబడి.. ప్రతినెలా స్థిరమైన ఆదాయం..
మీ పెట్టుబడికి గ్యారంటీ రాబడి.. ప్రతినెలా స్థిరమైన ఆదాయం..
కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024పరీక్ష.. ఆన్సర్ కీ విడుదల ఎప్పుడంటే
కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024పరీక్ష.. ఆన్సర్ కీ విడుదల ఎప్పుడంటే
ఈ పిండి ఆ సమస్యలను రఫ్పాడించేస్తుంది.. ఆరోగ్యానికి డబుల్ ధమాకా..
ఈ పిండి ఆ సమస్యలను రఫ్పాడించేస్తుంది.. ఆరోగ్యానికి డబుల్ ధమాకా..