AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారు.. ఎవరిని విజేతగా ప్రకటిస్తారు..

2024 లోక్‌సభ ఎన్నికలు తొలి దశ ముగిశాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. మరో కొన్ని గంటల సమయంలో రెండవ దశ పోలింగ్ కు సిద్దంగా ఉంది దేశం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల రంగంలో నిలబెట్టాయి. అయితే ఓటరుకు తన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం నోటా ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

Lok Sabha Elections 2024: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారు.. ఎవరిని విజేతగా ప్రకటిస్తారు..
Nota
Srikar T
|

Updated on: Apr 24, 2024 | 2:39 PM

Share

2024 లోక్‌సభ ఎన్నికలు తొలి దశ ముగిశాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. మరో కొన్ని గంటల సమయంలో రెండవ దశ పోలింగ్ కు సిద్దంగా ఉంది దేశం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల రంగంలో నిలబెట్టాయి. అయితే ఓటరుకు తన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం నోటా ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎన్నికల్లో నోటా పాత్ర ఏమిటో, నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నోటా అంటే ‘ఎవరూ కాదు’ అని అర్థం. EVM మెషీన్‌లు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి, అయితే గత దశాబ్దం నుండి మాత్రమే NOTA బటన్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2013లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను ప్రవేశపెట్టారు ఎన్నికల అధికారులు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2013 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓటర్లకు నోటా ఆప్షన్‌ ఇవ్వడం ప్రారంభమైంది. ఈ బటన్ EVM చివర ఉంటుంది.

ప్రజాస్వామ్యంలో నోటా ప్రాముఖ్యత ఏమిటి?

ప్రజాస్వామ్యంలో పౌరులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. ఇది ప్రజాస్వామ్య ప్రతిష్టకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది. అయితే ఓటర్లు ఏ అభ్యర్థిని తనకు సేవచేసే ప్రజాప్రతినిధిగా గుర్తించకపోతే? దాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల సంఘం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసి దీనికి నోటా అని పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి

నోటా అనేది ఎన్నికలలో సాధారణ ప్రజల ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్‌తో ఓటరు తన అయిష్టాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. తద్వారా రాజకీయ పార్టీలు తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్యర్థులను నిలబెట్టాలనే స్పృహకు వచ్చాయి. నోటాకు ముందు, ఓటరు ఏ అభ్యర్థిని మంచివాడిగా పరిగణించకపోతే, సదరు ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోడు. దీంతో అతని ఓటు వృథా అవుతుంది.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే?

నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే, మిగతా అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. వాస్తవానికి, డిసెంబర్ 2018లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితిలో, అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

మళ్లీ ఎన్నికల్లో నోటా గెలిస్తే ఏమవుతుంది?

మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం 2018లో ఇచ్చిన ఆదేశంలో, నోటాకు ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’ హోదా అందజేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, ఒక అభ్యర్థి ‘ఊహాత్మక అభ్యర్థి’ అంటే నోటాకు సమానమైన ఓట్లు వస్తే, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే నిజమైన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. అన్నింటి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏ అభ్యర్థికి నోటా కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే, మూడోసారి ఎన్నికలు జరగవు. అటువంటి పరిస్థితిలో, నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలు రాష్ట్రంలో ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..