AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ.. వైరల్ అవుతున్న వీడియో

లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లోని రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. కాంగ్రెస్ తన కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అందుకే రెండు సీట్లపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త వీడియో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

Lok Sabha Election: అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ.. వైరల్ అవుతున్న వీడియో
Rahul Gandhi Ppriyanka Gandhi Robert Vadra
Balaraju Goud
|

Updated on: Apr 24, 2024 | 9:28 AM

Share

లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లోని రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. కాంగ్రెస్ తన కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అందుకే రెండు సీట్లపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త వీడియో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఇందులో రాబర్ట్ వాద్రాను అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

తాజాగా ANI ఒక వీడియోను విడుదల చేసింది. వీడియోతో పాటు ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ఏమిటంటే – ‘అమేథీ, గౌరీగంజ్ కాంగ్రెస్ కార్యాలయాల వెలుపల పోస్టర్లు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను పోటీ చేయమని డిమాండ్ చేశారు. అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.’ ఇప్పుడు ఈ పోస్టర్లు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. ఇందులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

రాబర్ట్ వాద్రా ఇటీవల అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్నకు సమాధానంగా, తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అమేథీ నుండి మాత్రమే కాకుండా దేశం మొత్తం నుండి రాజకీయ పిలుపు వస్తోందని రాబర్ట్ వాద్రా అన్నారు. 1999 నుండి అక్కడ ప్రజల మధ్య ఎన్నికల ప్రచారం చేస్తున్నానన్నారు. అందుకే అక్కడి ప్రజలు నుండి డిమాండ్ రావడం సహాజమన్నారు. ఏకంగా పోస్టర్లు కూడా వేయడం ప్రారంభించినందున అమేథీ గురించి ఎక్కువ డిమాండ్ వస్తుందన్నారు. ఇతర ప్రదేశాలలో కూడా పోస్టర్లు వేస్తున్నారన్నారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దేశం కోసం ఎంత చేసిందో, చేస్తుందో, చేస్తూనే ఉంటుందో అంటూ ఎదురుచూస్తున్నారని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. అయితే తప్పుడు ఆరోపణలో స్మృతి ఇరానీ ఎంపీగా గెలిచారన్న వాద్రా, తమ సమస్యలు ఎవరు తీరుస్తారో అమేథీ ప్రజలకు తెలుసన్నారు రాబర్ట్ వాద్రా. చూడాలి మరీ అమేథీ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందో..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…