యూపీలో దారుణం..రూ. 2 కోట్ల కోసం యువకుని కిడ్నాప్.హత్య..కోవిద్ మృతుడంటూ అంత్యక్రియలు
యూపీలో దారుణం జరిగింది. ఆగ్రాలో కోల్డ్ స్టోరేజీ యజమాని కొడుకైన సచిన్ చౌహాన్ అనే యువకుడిని అతని స్నేహితుడు మరికొందరు కలిసి జూన్ 21 న కిడ్నాప్ చేశారు. అదే రోజున హతమార్చారు. ఇతని కుటుంబం నుంచి రూ. 2 కోట్లను డిమాండ్ చేయబోయారు.
యూపీలో దారుణం జరిగింది. ఆగ్రాలో కోల్డ్ స్టోరేజీ యజమాని కొడుకైన సచిన్ చౌహాన్ అనే యువకుడిని అతని స్నేహితుడు మరికొందరు కలిసి జూన్ 21 న కిడ్నాప్ చేశారు. అదే రోజున హతమార్చారు. ఇతని కుటుంబం నుంచి రూ. 2 కోట్లను డిమాండ్ చేయబోయారు.ఎవరికీ అనుమానం రాకుండా కోవిద్ తో ఇతడు మరణించినట్టు నాటకమాడారు. పీపీఈ కిట్లు ధరించి ఆ యువకుడి అంత్యక్రియలు చేశారని ఆ తరువాత పోలీసులు తెలిపారు. మొదట వీరు గత సోమవారం సచిన్ కి ఫోన్ చేసి నిర్మానుష్యమైన ఓ వాటర్ ప్లాంట్ వద్దకు రావలసిందిగా కోరారని, అతడు రాగానే అంతా కలిసి మద్యం సేవించారని ఖాకీలు చెప్పారు. అదే రోజున అతడిని లామినేషన్ పేపర్ తో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారన్నారు. ఇతడి మృతిని కోవిద్ సంబంధ మృతిగా చూపడానికి యత్నించారన్నారు. ఆటు-తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో సచిన్ చౌహాన్ తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు నిందితులు పీపీఈ కిట్లు ధరించి సచిన్ మృతదేహానికి అంత్య క్రియలు చేసినట్టు వెల్లడైంది.
నిజానికి అదే రోజున 2 కోట్లను డిమాండు చేయదలచుకున్నారని..కానీ తమ దారుణం బయటపడుతుందని భయపడి ఇందుకు వెనకాడారని పోలీసులు చెప్పారు. చివరకు నిందితులు ఐదుగురిని వారు అరెస్టు చేశారు. ఆగ్రాలో జరిగిన ఈ అమానుషం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.