Online Gaming: టీచర్ ఎకౌంట్ నుంచి మాయం అయిన మూడు లక్షల రూపాయలు.. పోలీసులు తేల్చింది ఏమిటంటే..

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ చాలా ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఈ గేమ్స్ పిల్లల్లో ఎన్నో సమస్యలను కొనితెస్తున్నాయి.

Online Gaming: టీచర్ ఎకౌంట్ నుంచి మాయం అయిన మూడు లక్షల రూపాయలు.. పోలీసులు తేల్చింది ఏమిటంటే..
Online Gaming
Follow us

|

Updated on: Jun 28, 2021 | 7:09 PM

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ చాలా ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఈ గేమ్స్ పిల్లల్లో ఎన్నో సమస్యలను కొనితెస్తున్నాయి. అందులోనూ కరోనా మహమ్మరి వ్యాప్తి పెరిగిన తరువాత పిల్లలు ఇంటికే పరిమితం అయిపోవడంతో, ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగ్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ గేమింగ్ అలవాటు పడిన ఒక పిల్లవాడు చేసిన పనికి తల్లిదండ్రులు లబోదిబోమనాల్సి వచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రం కాంకర్‌లోని ఒక మహిళ మూడు నెలల్లో రూ .3.22 లక్షలు కోల్పోవలసి వచ్చింది. తన బ్యాంక్ ఖాతా నుంచి ఇంత సొమ్ము తగ్గిపోవడంపై ఆ మహిళ ఆందోళన చెందారు. ఇదేదో ఆన్‌లైన్ మోసమని భావించిన ఆమె పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. అయితే, దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ డబ్బు ఆన్‌లైన్ గేమింగ్ కోసం ఖర్చు చేసినట్టు తేల్చారు.

కంకర్ లోని పీవీ 12 మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయురాలి ఖాతా నుంచి సొమ్ము తగ్గినట్టు గుర్తించింది. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో ఆమె 12 ఏళ్ల కొడుకు ఫ్రీ ఫైర్ అనే గేమ్ లో ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేశాడు. పంఖాజూర్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మర్చి 8 నుంచి జూన్ 10 తేదీల మధ్య ఆ మహిళా ఉపాధ్యాయురాలు శుభ్రా ఖాతా నుంచి 278 లావాదేవీలు జరిగాయి. ఈ సమయంలో మొత్తం 3.22 లక్షల రూపాయలు ఆ ఖాతా నుంచి మాయం అయిపోయాయి. ఆమె జూన్ 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. దర్యాప్తులో ఈ సొమ్ము ఆన్‌లైన్ గేమింగ్ కోసం శుభ్రా 12 ఏళ్ల కుమారుడు ఖర్చు చేసినట్టు తేలింది. ఇన్నిసార్లు ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అవుతున్నా కానీ, శుభ్ర మొబైల్ కు ఒటీపీ కానీ మెసేజ్ కానీ రాకపోవడం విశేషం అని పోలీసులు చెప్పారు. అందుకే, ఆమెకు విషయం తెలియలేదు. ఎకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే క్రమంలో ఆమె తన ఖాతాలో డబ్బు మాయం అయిందని తెలుసుకున్నారు. ఆమె బ్యాంక్ ఎకౌంట్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ నుంచి ఈ సొమ్ము బదిలీ అయింది.

పోలీసుల దర్యాప్తులో ఈ ప్రాంతంలోని చాలా మంది పిల్లలు ఈ ఆట విపరీతంగా ఆడుతున్నట్టు తెలిసింది. వీరిలో ఇలాంటి ఆయుధాలను ఆన్‌లైన్‌లో చాలామంది కొనుగోలు చేశారు. అయితే, పెద్దలు ముసుగులో తమ పిల్లలు ఇలా చేశారని కుటుంబం ఆరోపించింది. పిల్లలు ఇంటి నుండి పాకెట్ మనీ, డబ్బును దొంగిలించడం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఆన్‌లైన్ సౌకర్యం లేని వారు వేరొకరి నుండి కొనుగోళ్లు చేయడానికి డబ్బు చెల్లిస్తున్నారు.

రాయగడ్ లో.. గతంలో ఇటువంటి ఆన్‌లైన్ గేమింగ్ విషయంలోనే రాయగడ్ లో 17 ఏళ్ల విద్యార్ధి హత్యకు గురయ్యాడు. ఆన్‌లైన్ గేమింగ్ కోసం తన స్నేహితుడు చమన్ వద్ద అప్పు చేశాడు ఆ విద్యార్ధి. ఆ డబ్బు కోసం అతన్ని హత్యచేశారు. మర్చి 11 నా ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆ విద్యార్ధి మృతదేహం నాలుగు రోజుల తరువాత గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అడివిలో దొరికింది.

పిల్లలపై నిఘా అవసరం..

కరోనా కారణంగా, కొనుగోలు, చెల్లింపుతో పాటు, అధ్యయనాలు కూడా ఆన్‌లైన్‌లో మారాయి. దీంతో, పిల్లలు కూడా ఇప్పుడు మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొబైల్‌లో పిల్లలకు ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు, దాని మంచి, చెడు రెండింటినీ పిల్లలకు చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ వాడుతున్నప్పుడు పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం అని వారు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉన్న పిల్లలతో పంచుకోవడం అనర్ధాన్ని తెస్తుంది. పిల్లలు మొబైల్‌లో ఏమి ఆడుతున్నారనే దాని గురించి తల్లిదండ్రుల వద్ద పూర్తి సమాచారం ఉండేలా చూసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండటం వారిని సైబర్ క్రైమ్, మోసాలకు గురి చేస్తుందని పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఆన్‌లైన్ సదుపాయాన్ని తల్లిదండ్రుల ముందే ఉపయోగించుకునేలా చేయడం మంచిది. ఫైర్ గేమ్ లాంటివి ముందు ఉచితంగా అందిస్తారు. దాన్ని ఆడటానికి డబ్బులు ఖర్చుకావు. కానీ, పిల్లలు దానికి అలవాటు పడిన తరువాత ఆ గేమ్ లో అందుబాటులో ఉండే కొన్ని ఆయుధాలు ఉపయోగించాలంటే గేమ్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో డబ్బు పెట్టి ఆయుధాలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడే చాలా మంది పిల్లలు డబ్బులు ఖర్చు చేసేస్తారు. దీనిని గమనించి పిల్లలను అదుపులో పెట్టుకోవడం తల్లిదండ్రుల బాధ్యత.

Also Read: Crime News: జ‌స్ట్ 100 రూపాయ‌ల కోసం మాజీ వైస్‌ చాన్సలర్‌ దారుణ హత్య..

Thief: దొంగ‌గా మారిన నేవీ అధికారి.. భార్య‌తో క‌లిసి న‌గ‌ల దుకాణంలో చోరీ.. దారి త‌ప్పిన విద్యావంతుడు…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..