Tamil Nadu: చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చనిపోతున్నా.. లేఖ రాసి యువకుడు సూసైడ్
చనిపోయాక ఏం జరుగుతుంది.. ? ఇదేం ప్రశ్న అని ఫైర్ అవుతున్నారా.. కాస్త ఆగండి. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు. ప్రాణం పోయాక తప్పులు చేసిన వారు నరకానికి వెళ్తారని కొందరు, పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి...
చనిపోయాక ఏం జరుగుతుంది.. ? ఇదేం ప్రశ్న అని ఫైర్ అవుతున్నారా.. కాస్త ఆగండి. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు. ప్రాణం పోయాక తప్పులు చేసిన వారు నరకానికి వెళ్తారని కొందరు, పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి వెళ్తారని మరి కొందరు చెప్పుకుంటుంటారు. వాస్తవానికి నరకం, స్వర్గం ఉందా అంటే అది ఎవరికి తెలియదు. కొన్ని పురాణాలు, గ్రంథాలు వీటి ప్రస్తావన చేయడంతో పలువురు వీటిని నమ్ముతున్నారు. అయితే ప్రాణం పోతే.. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు(Tamil Nadu) లోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్.. చెన్నై(Chennai) తరమణిలో ఉన్న లా కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్టల్ లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ తిరునెల్వేలికి వెళ్లాడు. అనంతరం చెన్నై వచ్చాడు. అప్పటి నుంచి తమతో సరిగా మాట్లాడటం లేదని, మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తోటి విద్యార్థులు గమనించారు. ఈ పరిస్థితుల్లోనే సల్మాన్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే సమయంలో వారికి ఓ లెటర్ దొరికింది. ఆ లేఖను ఓపెన్ చేసి చూస్తే వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను దాచిన రూ.5వేల నగదును అమ్మకు అప్పగించండి’’ అని రాసి ఉంది. అయితే.. ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు వేరే ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి