Telangana: పెట్రోల్ పోసి మంటల్లో తోసేశారు.. సజీవ దహనానికి కట్టెలూ సిద్ధం చేశారు.. కట్ చేస్తే

సాంకేతికపరంగా సమాజం వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లోనూ మూఢ నమ్మకాలు వెలుగు చూస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. దాడులు...

Telangana: పెట్రోల్ పోసి మంటల్లో తోసేశారు.. సజీవ దహనానికి కట్టెలూ సిద్ధం చేశారు.. కట్ చేస్తే
Black Magic
Follow us

|

Updated on: Jun 05, 2022 | 8:35 AM

సాంకేతికపరంగా సమాజం వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లోనూ మూఢ నమ్మకాలు వెలుగు చూస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. దాడులు చేయడం, అమానుష ఘటనలకు పాల్పడడం, ఊరి నుంచి వెలేయడం వంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణ(Telangana) లోని మెదక్ (Medak) జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చేతబడి, మంత్రాలు చేస్తున్నాడన్న కారణంతో సొంత మేనమామపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఒంటిపై పెట్రోల్ పోసి, మంటల్లో తోసేశారు. సజీవ దహనం చేసేందుకు కట్టెలూ సిద్ధం చేశారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో బాధితుడు ప్రాణాలతో మిగిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

మెదక్ జిల్లా చల్మెడ గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్‌.. బీడీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు ఉన్నారు. సుదర్శన్ తో పాటు అతని చెల్లి భూదేవి కూడా కుటుంబంతో కలిసి అదే గ్రామంలో నివాసముంటోంది. ఆమె కోడలు రుచిత అనారోగ్యంతో బాధపడుతోంది. రుచిత అనారోగ్యానికి తన అన్న సుదర్శన్ కారణం అని అనుమానం పెంచుకుంది. సుదర్శన్‌ మంత్రాలు చేయడంతోనే తన కోడలికి ఈ పరిస్థితి వచ్చిందని భావించింది. ఈ క్రమంలో వారంతా సుదర్శన్ ఇంటికి వెళ్లి మాట్లాడి వెళ్లిపోయారు. కాసేపయ్యాక మళ్లీ తిరిగి వచ్చి సుదర్శన్‌, ఆయన భార్య బాలమణి, కుమారుడు హరికృష్ణలపై దాడి చేశారు.

మరికొంతమంది గ్రామస్థులు కూడా సుదర్శన్ పై దాడి చేశారు. బైక్ కు నిప్పంటించారు. సుదర్శన్‌పై పెట్రోల్ పోసి మంటల్లోకి తోసేశారు. ఈ ఘటనలో సుదర్శన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా సుదర్శన్ ను సజీవ దహనం చేసేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా అదే సమయంలో గ్రామానికి వచ్చిన పోలీసులు జనం గుమిగూడి ఉండటాన్ని గమనించి, సుదర్శన్‌ను కాపాడారు. చికిత్స నిమిత్తం బాధితుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్