Andhra Pradesh: ఆడపిల్ల పుట్టిందని భార్యకు వేధింపులు.. తట్టుకోలేని ఆమె ఏం చేసిందంటే
ప్రస్తుత సమాజంలో ఆడా, మగా ఇద్దరు సమానంగా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో మగవారి కంటే ఆడవారే ముందున్నారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. ఆడపిల్ల...
ప్రస్తుత సమాజంలో ఆడా, మగా ఇద్దరు సమానంగా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో మగవారి కంటే ఆడవారే ముందున్నారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కట్టుకున్న వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తీవ్ర వేధింపులకు గురి చేసి, ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా కృష్ణా(Krishna district) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆడపిల్లను జన్మించిందన్న కారణంతో ఓ ప్రబుద్ధుడు భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారు. విడాకులు కావాలంటూ వేధించాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గంపల సోమేశ్వరరావు ఓ హోటల్ లో వర్కర్ గా పని చేస్తున్నాడు. మాధవి అనే యువతిని 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు మాధవి గర్భం దాల్చింది. నెలలు పూర్తయ్యాక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అప్పటి నుంచి మాధవిని ఆమె భర్త సోమేశ్వరరావు, అత్త తీవ్రంగా వేధించారు. విడాకులు కావాలంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వారు వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుబసభ్యులు వెంటనే అప్రమత్తమై మాధవిని ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మాధవి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. తన భర్త తనకు కావాలని, కాపురానికి తీసుకెళ్లాలని కన్నీటి పర్యంతమైంది.