Telangana: నమస్తే పెట్టలేదని రచ్చ రచ్చ చేసిన ఎంపీటీసీ.. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ..
Telangana: జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ తమ స్టూడెంట్స్ చేత అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటారు.
Telangana: జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ తమ స్టూడెంట్స్ చేత అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటారు. ఆ సీన్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలిచే ఆ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, అచ్చం అలాంటి సీన్‌నే ఓ ఎంపీటీసీ తలపించాడు. అయితే, ఆ సీన్ ఆహ్లాదాన్ని కలిగిస్తే.. ఈ సీన్ రచ్చను క్రియేట్ చేసింది.
మహమబూబాబాద్ జిల్లా గార్ల ఎంపీడీవో కార్యాలయంలో అధికార పార్టీ ఎంపీటీసీ రమేష్ హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ఎంపీడీవో కార్యాలయంలో వచ్చిన రమేష్.. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు నమస్తే పెట్టలేదని ఫైర్ అయ్యాడు. సిబ్బందిపై చిందులు తొక్కాడు. ఎంపీడీవో ముందే అటెండర్‌లపై దురుసుగా ప్రవర్తించాడు. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్‌పై కూడా తన ప్రతాపం చూపించాడు ఎంపీటీసీ. అయితే, మద్యం మత్తులో నానా యాగీ చేసిన ఎంపీటీసీపై స్థాపిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది. తమ పట్ల అసభ్యంగా ప్రవర్శించాడని, నమస్తే పెట్టలేదనే కారణంతో దూషించాడంటూ ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, మహిళా అటెండర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు.