Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరిన్ని సంచలనాలు.. నోరు విప్పిన సుబ్బారావు..
Agnipath Protest: ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి.
Agnipath Protest: ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడైన సుబ్బారావు.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో నోరు విప్పాడు. తన అనుచరులతో కలిసి ఈ విధ్వంసానికి పథకం రచించినట్లు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో కలిసి విద్యార్థులను రెచ్చగొట్టించినట్లు నిర్ధారించారు పోలీసులు. సుబ్బారావు ఆదేశాలతోనే గ్రూపుల్లో ఆందోళనలు చేయాలని అనుచరులు పిలుపునిచ్చినట్లు తేల్చారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. నరేష్ అనే మరో అనుచరుడుతో ఆందోళనకారులకు ఫుడ్ అందజేశారు. కాగా, నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 16వ తేదీన సుబ్బారావు సికింద్రాబాబు చేరుకున్నాడు. అదే రోజు హోటల్‌లో అనుచరులతో భేటీ అయ్యాడు. ఆ భేటీలోనే విధ్వంసానికి భారీ ప్లాన్ వేశారు. సుబ్బారావు తెలిపిన ఈ సమాచారాన్ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. మరికాసేపట్లో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పదకాన్ని నిరసిస్తూ జూన్ 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభ్యర్థులు భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసం వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును నరసారావుపేటలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి, తెలంగాణ పోలీసులకు అప్పగించారు. అగ్నిపథ్ పదకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు వివిధ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థులకు పిలుపునిచ్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారించగా.. అసలు విషయాలు బయటకొస్తున్నాయి.