Crime News: సూటూబూటూ దొంగ.. దర్జాగా కారులో వస్తాడు.. దోచుకెళ్తాడు..

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఎదురెదురుగా ఉన్న రెండు అపార్ట్‌‌మెంట్లలో పట్టపగలే దొపిడి దొంగలు..

Crime News: సూటూబూటూ దొంగ.. దర్జాగా కారులో వస్తాడు.. దోచుకెళ్తాడు..
Theif
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2021 | 6:29 PM

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఎదురెదురుగా ఉన్న రెండు అపార్ట్‌‌మెంట్లలో పట్టపగలే దొపిడి దొంగలు తెగబడ్డారు. సూటుబూటు వేసుకుని చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌ పట్టుకుని.. హోండా సిటీ కారులో ఎంట్రీ ఇచ్చాడు. దర్జాగా వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని, తాళాలు బ్రేక్ చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. మొత్తం 45 తులాల బంగారం, ముప్పావు కిలో వెండి 50వేల క్యాష్ దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

అల్కాపురి కాలనీలోని స్ప్రింగ్ మిడౌస్ అపార్ట్‌మెంట్‌లో లో నివాసముంటున్న హరిబాబు దంపతులు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. అయితే నవంబర్‌ 12న వీరు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు బ్రేక్ చేయడంతో పాటు డోర్ తీసి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్ళి చూడగా, అల్మారా లాక్ తీసి ఉంది. బీరు అల్మారా లోని 30 తులాల బంగారం, 45 వేల నగదు కనిపించలేదు. దాంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, దొంగలు బంగారం, వెండి నగలు ఎత్తుకుపోయారు గానీ,ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్లు ముట్టుకోలేదని చెబుతున్నారు. అలాగే హరిబాబు ఎదురింటి ఫ్లాట్ ఓనర్స్ కూడా రెండు వారాల క్రితం ఊరెళ్లారు. దాంతో వారి ఇంటి తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి..ఇంట్లోని వెండి వస్తువులు కనిపించకుండా పోవటంతో ఓనర్స్‌ ఇంట్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్‌ ఆధారంగా బృందాలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.

దొంగ నేరుగా ఈ ఇంటికే రాలేదు. ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్‌లో సేమ్ మూడో ఫ్లోర్ అదే 302 నెంబర్ ఫ్లాట్‌లో డోర్ పగలగొట్టి 13 తులాల బంగారం, కొంత నగదు ఎత్తు కెళ్లాడు. వీడు మాములు దొంగ కాదు. చాలా చాక చక్యం గా డోర్ బ్రేక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. కారు నెంబర్ ప్లేట్ చెక్ చేయగా హోండా ఆసీటివా బండి నెంబర్ ప్లేట్‌ని క్లోన్ చేసి కారుకి ఫిక్స్ చేసాడని తేలింది. కానీ, చివరకు అసలు నెంబర్‌ని ట్రేస్ చేయగలిగారు పోలీసులు.

Also Read:

  1. Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!
  2. 21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
  3. Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!
  4. Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టండి చూద్దాం.. పజిల్ అంత ఈజీ కాదండోయ్.!
  5. Viral Video: ఇదేం ‘మాస్’ క్రియేటివిటీ మావా.! ఈ వ్యక్తి చేసిన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు..