Gold Seized: లైఫ్ జాకెట్‌లో రూ. కోటి బంగారం దాచుకొని ఫ్లైట్ ఎక్కిన నిందితుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Delhi Airport: బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా
Delhi Airport: బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. లైఫ్ జాకెట్‌లో పెద్ద ఎత్తున బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
భారత్‌కు చెందిన వ్యక్తి ఓ కేసులో అరెస్టయి దుబాయ్ జైలులో మూడేళ్లుగా శిక్ష అనుభవించాడు. తాజాగా జైలు నుంచి విడుదలైన అతను.. ఈ రోజు స్పెస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. అయితే.. విమానంలో తనకిచ్చిన లైఫ్ జాకెట్‌ను నిందితుడు ఫ్లైట్ సీటు కింద వదిలేసి కిందకు దిగాడు. అతనిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో లైఫ్ జాకెట్‌ను పరిశీలించగా రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అయితే.. బంగారం సీటు కింద ఎందుకు దాచిపెట్టావంటూ అధికారులు నిందితుడిని తమదైన స్టైల్లో ప్రశ్నించారు. అయితే.. తనకు బంగారం ఇచ్చిన వాళ్లే సీటు కింద వదిలేయమని చెప్పారంటూ వెల్లడించాడు. దీంతో బంగారం స్మగ్లింగ్‌పై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారాన్ని సీజ్ చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read: