Indian Customs Policy: విదేశాల నుంచి ఎంత బాంగారం తీసుకురావచ్చు.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదు..
Indian Customs Policy: విదేశాల నుంచి వస్తువులు, వాహనాలు, పరికరాలు ఇతర వస్తువులు ఏం తీసుకువచ్చినా.. వాటి ట్రాన్స్‌పోర్ట్, ట్యాక్స్‌కు సంబంధించిన ధృవపత్రాలు అవసరం.
Indian Customs Policy: విదేశాల నుంచి వస్తువులు, వాహనాలు, పరికరాలు ఇతర వస్తువులు ఏం తీసుకువచ్చినా.. వాటి ట్రాన్స్‌పోర్ట్, ట్యాక్స్‌కు సంబంధించిన ధృవపత్రాలు అవసరం. ఒకవేళ అవసరమైన కాగితాలు లేకుండా.. వాటిని దేశంలోకి తీసుకువస్తే కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేస్తారు. ఉదాహరణగా చూసుకుంటే.. ఇటీవల టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోట్ల రూపాయల విలువైన బంగారు వాచీలను ముంబై ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, హార్దిక్ పాండ్యా నుంచి స్వాధీనం చేసుకున్న వాచీల విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం.. హార్దిక్ పాండ్యా వద్ద ఈ వాచీలకు సంబంధించిన బిల్లులు, ట్యాక్స్‌లకు సంబంధించిన సరైన పత్రాలు గానీ లేవని అధికారులు గుర్తించారు. కాగా, దీనిపై స్పందించిన హార్దిక్ పాండయా తన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు జప్తు చేయలేదని, కస్టమ్స్ డ్యూటీ అంచనా కోసం వారి వద్ద ఉంచినట్లు తెలిపాడు. అలాగే ఆ వాచీల ధర రూ. 5 కోట్లు కాదని, 1.5 కోట్లు అని స్పష్టం చేశాడు.
నిబంధనల ప్రకారం ట్యాక్స్ ఉంటుంది.. విదేశాల నుంచి తెచ్చిన వస్తువులపై కస్టమ్ డ్యూటీ వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కస్టమ్స్ డ్యూటీని నిర్ణయించడానికి చాలా నియమాలు ఉన్నాయి. వివిధ దేశాల నుంచి వస్తువులు, విదేశాలలో ఉండే కాలం వంటి అనేక అంశాల ప్రకారం ట్యాక్స్‌లు నిర్ణయిస్తుంది. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు తమ మొత్తం సరుకుల వివరాలను కస్టమ్స్ శాఖకు తెలియజేయాలి. విదేశాల నుండి ఏదైనా వస్తువులను నిర్ణీత పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు, తీసుకురావచ్చు. దీంతో పాటు మీరు ఆ వస్తువులన్నింటికీ అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండాలి.
విదేశాల నుంచి ప్రయాణికులు ఎంత బంగారం తీసుకురావచ్చు.. భారతదేశంలో ఏ పౌరుడు కూడా ప్రభుత్వం నిర్ణయించిన వస్తువుల పరిమాణం కంటే ఎక్కువ తీసుకురాలేరు. ఎవరైనా పరిమితికి మించి వస్తువులు తీసుకువస్తే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక సంవత్సరం పాటు విదేశాలలో నివసిస్తున్న పౌరులు గరిష్టంగా 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఈ బంగారం కూడా ఆభరణాల రూపంలో ఉండాలి. ఇది కాకుండా, మహిళలకు గరిష్టంగా 40 గ్రాముల బంగారం తీసుకువచ్చే అవకాశం ఉంది. పురుషులు తమతో గరిష్టంగా 20 గ్రాముల బంగారాన్ని మాత్రమే తీసుకురావచ్చు. ఇక విదేశాలకు వెళ్లి కొద్ది రోజులే అయినట్లయితే.. బంగారం తీసుకురాకపోవడమే మంచిది.
మద్యం, సిగరెట్లకు నియమాలు ఏమిటి?.. చాలా మంది విదేశాల నుండి ఖరీదైన మద్యం, సిగరెట్లను కొనుగోలు చేసి భారతదేశానికి తీసుకువస్తారు. అయితే, ప్రభుత్వం వీటిపై కూడా పరిమితి విధించింది. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుడు తనతో పాటు గరిష్టంగా 2 లీటర్ల మద్యం, బీరు తీసుకురావచ్చు. ఇది కాకుండా.. ప్రయాణికులు తమతో 100 సిగరెట్లు, 25 సిగార్లు, 125 గ్రాముల కంటే ఎక్కువ పొగాకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది.
Also read:
Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‌కు కర్ణాటక రత్న అవార్డ్..