AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..
Puneeth Raj Kumar
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2021 | 5:21 PM

Share

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మృతి చెంది రెండు వారాలు పూర్తి కావోస్తున్న ఇప్పటికీ ఆయన సమాధి వద్దకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా.. నిజ జీవితంలోనూ పునీత్ హీరోనే. సామాజిక సేవలతోపాటు.. ఎంత అభాగ్యులకు అండగా నిలిచారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గౌరవార్థం.. ఈరోజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఆయన చేసిన సేవలను.. సంస్మరణ సభలో వెల్లడించనున్నారు. ఈరోజు కన్నడ చిత్రపరిశ్రమను తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు ఈ సభను 3 గంటలపాటు నిర్వహిస్తారు. బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల వరకు పునీత్ నమన అనే పేరుతో ఈ సంస్మరణ సభ కార్యక్రమాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), శాండల్ వుడ్ ఫిల్మ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అసోసియేషన్స్ కలిసి నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి పునీత్ కుటుంబసభ్యులు సైతం వచ్చారు. దాదాపు ఈ కార్యక్రమానికి 1500 మంది అతిథులు విచ్చేశఆరు. కోలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. పునీత్ సంస్కరణ సభను టీవీ9 తెలుగులో లైవ్‏లో వీక్షించవచ్చు.

ఆ కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్యమంత్రి బసవరాజు మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్‏కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక అబ్బాయి పునీత్ అని.. తనకు చిన్నప్పటి నుంచి పునీత్ తెలుసునని.. చిన్నవయసులోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడని ముఖ్యమంత్రి అన్నారు.

Also Read: Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..

Virata Parvam​ : భీమ్లానాయక్ తర్వాతే విరాటపర్వం.. రానా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా..