AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలలో కాజల్ అగర్వాల్ ఒకరు. సుధీర్ఘకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..
Kajal
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2021 | 4:08 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలలో కాజల్ అగర్వాల్ ఒకరు. సుధీర్ఘకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో అగ్ర కథనాయికగా దూసుకుపోతుంది కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‍గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. గతేడాది.. తన స్నేహితుడు.. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం కాజల్ సినిమాలను కంటిన్యూ చేస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ మెగాస్టార్ చిరంజివి సరసన ఆచార్య సినిమా చేసింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ పూర్తై.. విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే గత కొద్ది కాలంగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాజల్ సినిమాల నుంచి తప్పుకుంటుందని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకున్న.. తాజాగా ఇండియన్ 2 సిమనిమా నుంచి బయటకు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే కాజల్.. తన భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

తాజాగా.. కాజల్.. తన భర్త గౌతమ్ కిచ్లును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తోందట.. తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు.. తన భర్త గౌతమ్ కిచ్లుకు ఒక రోల్ ఇవ్వాలని అడుగుతుందట. పాత్ర చిన్నదైన సరే కానీ.. కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందట. గౌతమ్ కు నటనపై ఇంట్రెస్ట్ ఉందని..దీంతో కాజల్..తనను నటుడిగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్. ఇప్పటికే పెళ్లైన కొత్తలో గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ ఓ కమర్షియల్ యాడ్‏లోనూ నటించిన సంగతి తెలిసిందే. అలాగే కాజల్ కూడా తన భర్తకు బిజినెస్ వ్యవహారాల్లో అండగా ఉంటుంది.

Also Read: Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?..

Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..

Samantha: ఎల్లోరా శిల్పమా.. సొంపుల సోయగమా.. కుర్రకారును కవ్విస్తున్న సామ్ లేటెస్ట్ పిక్స్