Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?.. 

టాలీవుడ్ ఇండస్ట్రీకి అందాల రాక్షసిగా పరిచయమై కుర్రకారు మనసు దొచుకుంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్

Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?.. 
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2021 | 3:33 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి అందాల రాక్షసిగా పరిచయమై కుర్రకారు మనసు దొచుకుంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. అగ్ర కథనాయికగా దూసుకుపోయింది. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయనా… వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం.. అభినయంతోపాటు.. సొట్ట బుగ్గలతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్య. అయితే ముందు నుంచి ఈ అమ్మడు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో లావణ్య త్రిపాఠికి అవకాశాలు కాస్త తగ్గాయి. ఇక ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అంతగా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా..ఈ సినిమా తను చేసి ఉండకూడదు అనే విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్లుగా సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‏గా లావణ్యను ఎంపిక చేసినట్లుగా టాక్. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత మహేష్…త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మించనున్నారు. గతంలో మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు.. ఖలేజా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో మళ్లీ వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలాకాలంగా హిట్ లేకుండా ఉన్న లావణ్యకు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

Samantha Pushpa: ఐదు నిమిషాల పాటకు అన్ని కోట్లా..! పుష్పరాజ్‌తో స్టెప్పులేస్తుందనందుకు సామ్‌ భారీగా డిమాండ్‌..