Samantha Pushpa: ఐదు నిమిషాల పాటకు అన్ని కోట్లా..! పుష్పరాజ్‌తో స్టెప్పులేస్తుందనందుకు సామ్ భారీగా డిమాండ్..
Samantha Pushpa: విడాకుల తర్వాత సినిమాల్లో జోరు పెంచిన సమంత అందుకు దగ్గట్లుగానే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పింది సామ్.. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా..
Samantha Pushpa: విడాకుల తర్వాత సినిమాల్లో జోరు పెంచిన సమంత అందుకు దగ్గట్లుగానే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పింది సామ్.. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిన నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ పాట కోసం సమంత భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం 5 నిమిషాల నిడివి ఉన్న పాటలో నటించేందుకు సమంత రూ. కోటిన్నర తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తోన్న చిత్ర యూనిట్ సమంత డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సినీ వర్గల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక సుకుమార్.. హీరోయిన్లను స్పెషల్ సాంగ్స్‌లో నటింపజేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రామ్‌చరణ్-సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలంలో పూజా ఆడిపాడిన విషయం తెలిసిందే. జిగేల్ రాణి సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise ?#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg
— Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021
Also Read: Nirmala Sitharaman: పెట్రో ధరల భారం తగ్గాలంటే వారిని నిలదీయండి.. నిర్మలా సీతారామన్ సలహా
Coronavirus: 9 నెలల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు.. నిన్న ఎన్నంటే..