Coronavirus: 9 నెలల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు.. నిన్న ఎన్నంటే..
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పాజిటివ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. నిన్న కొత్తగా 8,865 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం..
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పాజిటివ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. నిన్న కొత్తగా 8,865 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం 287 రోజుల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంటోంది. మరణాలు కూడా 200లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 11, 07, 617 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,865 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక మహమ్మారి బారిన పడి నిన్న 197 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63, 852కి చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సింహభాగం కేరళవే కావడం గమనార్హం. ఆరాష్ట్రంలో సోమవారం 4547 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 57 మంది మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజులుగా కరోనా రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంటోంది. నిన్న ఒక్కరోజే 11971 మంది కరోనాపై విజయం సాధించారు. ఇప్పటివరకు మొత్తం 3.38 కోట్ల మంది వైరస్‌ను జయించడంతో రికవరీ రేటు 98.27 శాతానికి చేరుకుంది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,30, 793. మొత్తం ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో ఇది 0.38శాతం. ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే…సోమవారం 59, 75, 469 మంది టీకాలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,12, 97, 84, 045 కోట్లకు చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/a1k44HRG5o pic.twitter.com/XEdO73xs3a
— Ministry of Health (@MoHFW_INDIA) November 16, 2021
Also read:
Karivena Satram: కాశీ తెలుగు యాత్రికులకు గుడ్‌న్యూస్.. వారణాసిలో అందుబాటులోకి వచ్చిన అధునాతన భవనం!
Hardik Pandya: ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు.. ఎందుకంటే..