Hardik Pandya: ఎయిర్‎పోర్ట్‎లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్​ అధికారులు.. ఎందుకంటే..

భారత క్రికెట్ స్టార్ ఆల్‎రౌండర్ హార్దిక్ పాండ్యా‎కు ముంబై ఎయిర్‎పోర్ట్ కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్​ముగించుకుని దుబాయ్​ నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం...

Hardik Pandya: ఎయిర్‎పోర్ట్‎లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్​ అధికారులు.. ఎందుకంటే..
Hardik
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 16, 2021 | 10:05 AM

భారత క్రికెట్ స్టార్ ఆల్‎రౌండర్ హార్దిక్ పాండ్యా‎కు ముంబై ఎయిర్‎పోర్ట్ కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్​ ముగించుకుని దుబాయ్​నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముంబై ఎయిర్‎పోర్ట్‎లో దిగిన పాండ్యా వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు హార్దిక్ వద్ద గుర్తించారు. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

దీనిపై హార్దిక్ పాండ్యా స్పందించారు. నవంబర్ 15న సోమవారం తెల్లవారుజామున నేను దుబాయ్ నుండి వచ్చాను. నా లగేజీని తీసుకున్న తర్వాత, నేను తీసుకువచ్చిన వస్తువుల వివరాలు చెప్పడానికి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయ కస్టమ్స్ కౌంటర్‌కి వెళ్లాను. నేను చేసిన ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. వాచ్ ఖరీదు దాదాపు రూ. 1.5 కోట్లని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం 5 కోట్లు కాదు. నేను దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను. నేను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనకు సహకరించింది. వారికి నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి వారికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను అందజేస్తాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అని పాండ్యా చెప్పాడు.

గత సంవత్సరం హార్దిక్ అన్నయ్య, కృనాల్ పాండ్యా దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా అనుమతి లేని బంగారం, ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారనే అనుమానంతో ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కృనాల్ వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం, కొన్ని బహిర్గతం చేయని లగ్జరీ వాచీలు దొరికాయి. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయలేదు.

Read Also.. Chahal: టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో నిరాశకు గురయ్యాను.. రోహిత్‎తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..