Beer In Shoes: ఆస్ట్రేలియా ప్లేయర్స్ బూట్లలో బీరు పోసుకొని ఎందుకు తాగారో తెలుసా.? దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..
Beer In Shoes: సాధారణంగా ఎవరైనా బీరుని ఎలా తాగుతారు.? అదేం ప్రశ్న.. అయితే బాటిల్‌తో తాగుతారు. లేదా గ్లాసులో పోసుకొని తాగుతారు. ఇది మనకు తెలిసిందే. అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ తర్వాత..
Beer In Shoes: సాధారణంగా ఎవరైనా బీరుని ఎలా తాగుతారు.? అదేం ప్రశ్న.. అయితే బాటిల్‌తో తాగుతారు. లేదా గ్లాసులో పోసుకొని తాగుతారు. ఇది మనకు తెలిసిందే. అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ విజయాన్ని అందుకున్న తర్వాత డ్రెసింగ్ రూమ్‌లో చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సంబురాల్లో భాగంగా ప్లేయర్స్ బీరును షూలో పోసుకొని తాగడం చర్చనీయాంశంగా మారింది. అసలు బీరును షూలో పోసుకొని తాగడం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతకీ అసలు బీరును షూలో పోసుకొని ఎందుకు తాగుతారు.? దీని వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీరును షూలో పోసుకొని తాగడం ఒక ఆచారమనే విషయం మీకు తెలుసా. దీనిని ఆస్ట్రేలియాలో ‘షూయి’గా పిలుస్తుంటారు. ఇది కూడా ఒక రకమైన సంబరమే. ఈ విచిత్రమైన ఆచారం మొదట 18వ శతాబ్ధంలో జర్మనీలో మొదలైంది. ఏదైన తప్పు చేసినప్పుడు వేసే శిక్షగా, భారీ అదృష్టం కలిసివచ్చినప్పుడు, సంబరాలు చేసుకోవడానికి ఈ ఆచారాన్ని పాటించేవారు. అనంతరం ఈ ఆచారం ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ అక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్స్ లాయిస్ హామిల్టన్, డేనియల్ రెకిర్డోలు షూలో బీరు పోసుకొని తాగడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇక తాజాగా వరల్డ్ కప్ గెలుచుకున్నామన్న సంతోషంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా షూయి నిర్వహించడంతో క్రికెట్ ప్రేక్షకులకు ఈ కొత్త విషయం తెలిసింది. అయితే ఈ ఆచారం మంచిదేనా అంటే కచ్చితంగా కాదని చెబుతున్నారు వైద్యులు. షూలలో స్టాఫలోకాకస్ అనే బ్యాక్టీరియా ఉంటుందని ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆచరయోగ్యమైంది కాదని సూచిస్తున్నారు.
Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..