KL Rahul: ద్రవిడ్‎తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను.. వైస్ కెప్టెన్సీ ఒక బాధ్యత..

భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు...

KL Rahul: ద్రవిడ్‎తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను.. వైస్ కెప్టెన్సీ ఒక బాధ్యత..
Kl Rahul
Follow us

|

Updated on: Nov 16, 2021 | 9:38 AM

భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు. జైపూర్‌లో బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. రాహుల్ డిప్యూటీగా వ్యవహరిస్తుండగా రోహిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. “వైస్ కెప్టెన్సీని బాధ్యతగా భావిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణాన్ని సృష్టించడం అవసరం. రాహుల్ ద్రవిడ్ కూడా వస్తాడు. కొత్త కోచింగ్ స్టాఫ్‌తో వచ్చే రెండు వారాల కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను” అని సోమవారం వర్చువల్ విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు.

టీ20 జట్టు నుంచి హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోవడానికి కారణం ఏమిటని అడిగ్గా.. ” అతను ఏమి చేయాలో, అతని నుండి ఏమి ఆశించాలో అతనికి కచ్చితంగా తెలుసు.. అతను దానిని అర్థం చేసుకునేంత తెలివైనవాడు.” అని న్నాడు. రాహుల్ ద్రవిడ్ తనకు చాలా కాలంగా తెలుసని చెప్పాడు.” యువకుడిగా, నేను అతని సూచనలు తీసుకోవాడానికి ప్రయత్నించాను. అతను రిటైర్ అయినా మా అందరికీ చాలా సహాయం చేశాడు. ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న అబ్బాయిలకు సహాయం చేసాడు. ఆ సెటప్‌లో భాగంగా అతను మాతో ఇక్కడ ఉండడం వల్ల మాకు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.” అని రాహుల్ పేర్కొన్నాడు. నేను కర్ణాటక తరఫున ఆడుతున్నప్పటి నుంచి రాహుల్ సర్‌ని అనుకరించేందుకు ప్రయత్నించేవాడిని. ఆయన ఎంతో మంది యువ క్రికెటర్లను టీమిండియాకు అందించారు. మైదానంలో ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఆడేలా చూస్తారు. ఆయనెప్పుడూ జట్టులో ఓ సభ్యుడిలా అందరితో కలిసి మెలిసి ఉంటారని రాహుల్ తెలిపారు.

టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్తాన్, న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎ల్లో విఫలమయ్యాడు. తర్వాతి మ్యాచ్‎ల్లో పుంజుకుని అద్భుతంగా రాణించాడు. ఈ వరల్డ్ కప్‎లో టీం ఇండియా నాకౌట్‎కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. టీ20 వరల్డ్ కప్‎ 2021ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‎లో కంగారులు కివీస్‎ను ఓడించారు.

Read Also.. Ind Vs Pak: భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‎పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. తమ చేతుల్లో ఏమి లేదన్న దాదా..