Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ చరిత్రలో నూతన శకాన్ని తీసుకొచ్చింది. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు, మన దేశ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడడం ఐపీఎల్ ప్రత్యేకత. విదేశాల ఆటగాళ్లకు కూడా భారత్‎లో అభిమానులు ఉన్నారు.

Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..
Rashid Khan
Follow us

|

Updated on: Nov 16, 2021 | 10:35 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ చరిత్రలో నూతన శకాన్ని తీసుకొచ్చింది. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు, మన దేశ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడడం ఐపీఎల్ ప్రత్యేకత. విదేశాల ఆటగాళ్లకు కూడా భారత్‎లో అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సం ఇండియాకు వచ్చి ఐపీఎల్ ఆడడంతో ఆటగాళ్లకు జట్టు, అభిమానులతో బంధం ఏర్పడింది. సన్‎రైజర్స్ హైదరాబాద్ ఆడే ఆటగాళ్లను తెలుగు ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‎కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అభిమానులు కేన్ విలియమ్సన్‎ను ప్రేమగా కేన్ మామ అంటారు. డేవిడ్ వార్నర్‎ను వార్నర్ కాకా అని పిలుచుకుంటారు. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు సన్‎రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్.

ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‎లో ఆసీస్ విజయకేతనం ఎగరేసి వరల్డ్ కప్ టైటిల్‎ను సాధించింది. విజేత ఆస్ట్రేలియాకు అభినందనలు తెలుపుతూ రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. “టీ20 ప్రపంచకప్ కప్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలు. న్యూజిలాండ్ ఆటగాళ్లు బాగా ఆడారు. కేన్ మామ, వార్నర్ కాకా .. ఇలా ఇద్దరి ఆటను చూడడం ఆనందంగా ఉంది” అని రషీద్ పోస్టు చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఫైనల్ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 173 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 77 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Read Also… Hardik Pandya: ఎయిర్‎పోర్ట్‎లో హార్దిక్ పాండ్యాకు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్​ అధికారులు.. ఎందుకంటే..