Chahal: టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో నిరాశకు గురయ్యాను.. రోహిత్‎తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..

టీ20 ప్రపంచ కప్ జట్టుకు తను ఎంపిక కాకపోవడం కొంచెం నిరాశకు గురి చేసిందని భారత లెగ్ స్పిన్నర్ చాహల్ అన్నాడు. ఐపీఎల్‎లో మెరుగైన ప్రదర్శన చేసినా టీంఇండియా జట్టులో చోటు దక్కకపోవడం బాధగా అనిపించిందని చెప్పాడు...

Chahal: టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో నిరాశకు గురయ్యాను..  రోహిత్‎తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..
Chahal
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 16, 2021 | 7:19 AM

టీ20 ప్రపంచ కప్ జట్టుకు తను ఎంపిక కాకపోవడం కొంచెం నిరాశకు గురి చేసిందని భారత లెగ్ స్పిన్నర్ చాహల్ అన్నాడు. ఐపీఎల్‎లో మెరుగైన ప్రదర్శన చేసినా టీంఇండియా జట్టులో చోటు దక్కకపోవడం బాధగా అనిపించిందని చెప్పాడు. ఆ సమయంలో తను పుంజుకోవడానికి కుటుంబం, అభిమానులు సహాయపడ్డారని చెప్పాడు. యూఏఈలో రెండో దశ ఐపీఎల్ ప్రారంభానికి వారం ముందు చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీ20 వరల్డ్ కప్ కోసం15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సెలెక్టర్లు చాహల్ స్థానంలో చాహర్ ఎంపిక చేశారు.

“నాలుగేళ్లలో నన్ను డ్రాప్ చేయలేదు. అలాంటిది మార్క్యూ ఈవెంట్ కోసం నేను డ్రాప్ అయ్యాను. రెండు మూడు రోజులు షాక్ నుంచి తెరుకోలేకపోయాను. నేను నా కోచ్‌ల వద్దకు తిరిగి వెళ్లి వారితో చాలా మాట్లాడాను” అని చాహల్ అన్నాడు. చాహల్ ఐపీఎల్ రెండో దశలో ఎనిమిది మ్యాచ్‌లలో 14 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 7.06 రేటు సాధించాడు. అక్టోబరు 10 నాటికి టీమ్‌ల్లో మార్పులు చేసేందుకు ఐసీసీ అనుమతించింది. అయితే సెలెక్టర్లు చాహల్‌ను తిరిగి తీసుకోలేదు. “నా భార్య, కుటుంబ సభ్యులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. నా అభిమానులు ప్రేరణ కలిగించే పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. అది నన్ను ఉత్సాహపరిచింది. నేను నా బలాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాను. అది నా ఐపీఎల్ ఫామ్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి నేను ఎక్కువ కాలం బాధపడలేదని” అని చెప్పాడు. అయితే నవంబర్ 17 నుండి జైపూర్‌లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు చాహల్ ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మతో తనకున్న బంధం ప్రత్యేకమైనదని యుజువేంద్ర చాహల్ అన్నాడు. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని చెప్పాడు. “రోహిత్ భాయ్‌తో నా బంధం ప్రత్యేకమైనది. రితిక (రోహిత్ భార్య) నన్ను తమ్ముడిలా చూసుకుంటుంది.” చాహల్ పేర్కొన్నాడు.

Read  Also.. David Warner: డేవిడ్‌ వార్నర్‌ని బలవంతంగా తొలగించారా..! సన్‌రైజర్స్‌ కోచ్ ఏం చెప్పాడంటే..?