AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

యంగ్ హీరో నితిన్ జోరు పెంచాడు.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు

Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..
Macherla Niyojakavargam
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2021 | 5:55 PM

Share

యంగ్ హీరో నితిన్ జోరు పెంచాడు.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్… హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ అందాదున్ సినిమాకు తెలుగు రీమేక్‏గా వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. ఇందులో నితిన్ అందుడి పాత్రలో నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నితిన్.. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించనున్నట్లుగా నెట్టింట్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ రూమర్స్‏కు చెక్ పెట్టారు మాచర్ల నియోజకవర్గం మేకర్స్. ఇందులో నటించే సెకండ్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో రెండవ కథనాయికగా.. కేథరిన్ థ్రెసాను ఫిక్స్ చేసినట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా. ఆమె లెటేస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్వీట్..

Also Read: Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?..