AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..

రమ్యకృష్ణ.. దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్‏గా తన సత్తా చాటుకున్న

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2021 | 6:32 PM

Share

రమ్యకృష్ణ.. దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్‏గా తన సత్తా చాటుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు విభిన్న పాత్రలతో తానేంటో నిరూపించుకుంటుంది. అప్పట్లో చిరంజీవి.. బాలకృష్ణ.. రజినీ కాంత్ నటనకు సరిసమానంగా నటించి మెప్పించి టాప్ హీరోయిన్‏గా కొన్నేళ్లపాటు కొనసాగింది రమ్యకృష్ణ. ఇక సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ రమ్యకృష్ణ దూసుకుపోతుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామిగా పాన్ ఇండియా రేంజ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకున్నారు. చిన్న గ్యాప్ ఇచ్చినా… ఇప్పటికీ చేసే ప్రతీ సినిమానూ ఒక సాలిడ్ కమర్షియల్ ఎలిమెంట్ అవుతున్నారు రమ్యకృష్ణ.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో రమ్యకృష్ణ నటించనున్నట్లుగా టాక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాకు తెలుగు రీమేక్‏గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ.. చిరంజీవి సోదరిగా నటిస్తున్నట్లుగా సమాచారం. మలయాళంలో మోహన్ లాల్ చెల్లెలిగా మంచు వారియర్ నటించగా.. తాజాగా తెలుగులో ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించనుందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. 90లో చిరంజీవి .. రమ్యకృష్ణ బ్యూటీఫుల్ పెయిర్‏గా స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read: Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..