AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam​ : భీమ్లానాయక్ తర్వాతే విరాటపర్వం.. రానా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా..

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటించిన సినిమా విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.

Virata Parvam​ : భీమ్లానాయక్ తర్వాతే విరాటపర్వం.. రానా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా..
Virata Parvam
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2021 | 1:54 PM

Share

Virata Parvam​ : దగ్గుబాటి యంగ్ హీరో రానా నటించిన సినిమా విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, ఒక పాట సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి విరాటపర్వంను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల పై అనేక సందేహాలు నెలకొన్నాయి. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారంటూ వార్తలు వినిపించాయి.  అయితే వెంకటేష్ నటించిన నారప్ప ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. అలాగే త్వరలో రానున్న దృశ్యం 2 సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో విరాటపర్వం సినిమా కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఈ వార్తలపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. విరాటపర్వం ఓటీటీలో విడుదలవుతుందన్న వార్తల్లో వాస్తవం లేదు అన్నారు.

అయితే ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. ఇదిలా ఉంటే రానా నటించిన భీమ్లానాయక్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో భీమ్లానాయక్ సినిమా తర్వాత విరాటపర్వం సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారట. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి.

Samantha Pushpa: ఐదు నిమిషాల పాటకు అన్ని కోట్లా..! పుష్పరాజ్‌తో స్టెప్పులేస్తుందనందుకు సామ్‌ భారీగా డిమాండ్‌..

Megha Akash: మేఘాల మాటున దాగిన వెన్నెల ఈ ముద్దుగుమ్మ.. మేఘా ఆకాష్ లేటెస్ట్ ఫొటోస్..

Actress Shalu Chourasiya: శాలు చౌరాసియా పై దాడి కేసులో కీలక మలుపు.. పోలీసులు ఏం చెపుతున్నారంటే..