Pan Card: రెండు పాన్ కార్డులున్నవారికి షాకింగ్ న్యూస్.. శిక్ష ఎంటో తెలుసా..
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డ్ మీకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పనుల కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఒకటి.

పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డ్ మీకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పనుల కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఒకటి. అటువంటి పరిస్థితిలో ఈ పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, ఈ పత్రాలను ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి ఆర్థిక లావాదేవీలకు PAN కార్డ్ తప్పనిసరి.. PAN లేకుండా మీరు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనిని పూర్తి చేయలేరు. తరచుగా మనం ఏదైనా ముఖ్యమైన పత్రం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా ఆ పత్రం సకాలంలో జోడించాల్సి ఉంటుంది.
అయితే తరచుగా మనం ఏదైనా ముఖ్యమైన పత్రం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా ఆ పత్రం సకాలంలో మనకు చేరకపోతే.. మనం మరొక సారి దరఖాస్తును చేసుకుంటాం.అటువంటి పరిస్థితిలో రెండు పత్రాలు చాలాసార్లు డిస్పాచ్ అవుతాయి. వాటిని సరెండర్ చేయడానికి బదులుగా వాటిని మీ వద్ద ఉంచుకుంటే.. భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే రెండు పాన్ కార్డ్‌లలో పాన్ నంబర్ భిన్నంగా ఉంటుంది. అయితే ఇది పెద్ద నేరం. రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లయితే మీరు భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
– ఎక్కడైనా పాన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేస్తున్నప్పుడు.. మళ్లీ చెక్ చేసుకోండి – పాన్ కార్డ్‌లో ఇచ్చిన 10 అంకెల నంబర్‌ను జాగ్రత్తగా పూరించడం అవసరం – తప్పుడు సమాచారాన్ని పూరించినందుకు మీకు జరిమానా విధించబడవచ్చు. – ఆదాయపు పన్ను రిటర్న్ నింపేటప్పుడు పాన్ నంబర్‌ను సరి చూసుకోండి. ఒకటిరి రెండు సార్లు చెక్ చేసుకోండి.
– తప్పుడు PAN సమాచారం ఇచ్చే వ్యక్తికి రూ. 10,000 జరిమానా విధించవచ్చు – ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B ప్రకారం.. తప్పు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించవచ్చు.
రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నందుకు ..
– మీకు రెండు పాన్ కార్డ్‌లు ఉంటే.. ఒక కార్డును సరెండర్ చేయడం తప్పనిసరి – రెండు పాన్ కార్డ్‌లను కలిగి ఉండటం వల్ల భారీ జరిమానాలు విధించబడతాయి. బ్యాంక్ ఖాతా కూడా స్తంభింపజేయవచ్చు – మీకు రెండు పాన్ కార్డ్‌లు ఉంటే, అక్కడ పాన్ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేయాలి.
– ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272Bలోని నిబంధన ప్రకారం రెండు పాన్ కార్డ్‌లను కలిగి ఉంటే రూ. 10,000 జరిమానా విధించవచ్చు.
రెండో పాన్ కార్డును ఇలా సరెండర్ చేయండి
వాస్తవానికి పాన్ కార్డును సరెండర్ చేసే ప్రక్రియ కూడా చాలా సులభం. దీని కోసం, మీరు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సాధారణ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌ను సందర్శించి, కొత్త పాన్ కార్డ్ కోసం అభ్యర్థన లేదా/ పాన్ డేటాలో మార్పులు లేదా దిద్దుబాటు అనే లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మీకు తెలియజేద్దాం. దీని తర్వాత, ఫారమ్‌ను పూరించండి. ఏదైనా NSDL కార్యాలయానికి సమర్పించండి. ఈ సమయంలో, ఫారమ్‌ను సమర్పించేటప్పుడు, ఫారమ్‌తో పాటు రెండవ పాన్ కార్డ్‌ను సమర్పించాలని గుర్తుంచుకోండి. మీకు కావాలంటే మీరు ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో కూడా చేయడానికి ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..




