Subhash Goud |
Updated on: Nov 16, 2021 | 9:04 PM
CNG Prices Hiked: దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీని కారణంగా సామాన్యుడికి మోయలేని భారంగా మారుతోంది. ఇక ఇదే సమంలో పెట్రోల్ ధరతో పోలిస్తే చౌకగా లభించే సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలు కూడా పెరిగిపోయాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలోకు రూ.2.28 పెరుగగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.2.56 పెరిగింది. గత 45 రోజుల్లో సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజాగా మళ్లీ పెరగడంతో వాహనదారులకు భారంగా మారింది.
ఈ ధరలు పెంపు విషయాన్ని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలో గ్యాస్ రూ. 52.04 చేరగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ. 58.58కు చేరింది.
ఇంతకు ముందు ఢిల్లీలో ఈ ధర రూ. 49.76గా ఉండగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ. 56.02గా ఉండేది. తాజాగా పెరిగిన ధరలతో మరింత భారంగా మారింది.