CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..

ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే..

CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Kcr
Follow us
Sanjay Kasula

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2021 | 7:20 PM

TRS – CM KCR: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన TRSLP సమావేశం ఉంటుంది. వరిపై కిరికిరి నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరిచుకుంది. కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం. వరిధాన్యం కొనుగోళ్లు, కేంద్రం వైఖరిపైనే TRSLPలో ప్రధాన చర్చ ఉంటుంది. ఈ నెల 29న దీక్ష చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్‌. దీక్ష ఎక్కడ చేయాలన్న దానిపై TRSLPలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుండటంతో.. కేంద్రంపై ఒత్తిడి పెంచడానకి ఇదే మంచి ఛాన్స్ అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

యాసంగి రచ్చ రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారుతోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కాస్తా.. దీక్షలు.. పాదయాత్రలుగా మారుతోంది. ప్రత్యర్థిని రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

మీరంటే మీరే రైతులను ముంచుతున్నారని.. మీరంటే మీరే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, డిమాండ్లకు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నాలో కూర్చోవాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: AP MPTC And ZPTC Elections 2021 Live: ఏపీలో కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికలు.. మందకొడిగా పోలింగ్‌..