Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైలు ఛార్జీలు తగ్గనున్నాయి.. ఎంత అంటే..!

Indian Railway: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. రైళ్లలో తక్కువ ఛార్జీలు ఉండటంతో..

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైలు ఛార్జీలు తగ్గనున్నాయి.. ఎంత అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 8:44 PM

Indian Railway: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. రైళ్లలో తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. ఇక కరోనా మహమ్మారి సమయంలో రైళ్లన్ని నిలిపివేయగా, కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత విడతల వారిగా రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. ప్రస్తుతం దాదాపు అన్ని రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కరోనా సమయంలో దూర ప్రాంతాలకు మాత్రమే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపింది. అయితే ఆ రైళ్లలో కాస్త ఎక్కువ ఛార్జీలను వసూలు చేసింది రైల్వే శాఖ.

రైలు ఛార్జీలు సాధారణ ప్రీ-కోవిడ్‌ ధరలు తిరిగి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కోవిడ్‌ సమయంలో ప్రత్యేక రైళ్లలలో టికెట్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇప్పుడు పెరిగిన ఛార్జీలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఈ ఛార్జీలు 15 శాతం వరకు తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇక ప్రత్యేక రైళ్లుగా ఉన్న 1700 రైళ్లలో రానున్న రోజుల్లో ఈ ఛార్జీలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో జాతీయ రవాణా సంస్థ 1180.19 మిలియన్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 69.88 మిలియన్లకు చేరుకుంది. భారతీయ రైల్వేలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ వరకు పెంచిన ఛార్జీల ద్వారా రూ.15,434,18 కోట్లను ఆర్జించింది. సెప్టెంబర్‌ 2020 వరకు రూ.1,258,74 కోట్లు ఉండేది.

అయితే ప్యాసింజర్‌ ఛార్జీల నుంచి నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు ప్రీ-పాండమిక్‌ పీరియడ్‌ ఆదాయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి.2019-20 రైళ్లలో 4,173.53 మిలియన్ల మంది ప్రయాణించారు. ఇక సెప్టెంబర్‌ 2019లో రూ.26,642,73 కోట్లు ఆర్జించింది రైల్వే శాఖ. అయితే కోవిడ్‌ను అరికట్టేందుకు ఇతర చర్యలను కొనసాగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కౌంటర్‌లలో టికెట్‌ విక్రయాలపై ఆంక్షలు, రైళ్లలో ఫుడ్‌ సరఫరా నిలిపివేయడంతో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు పెరిగాయి. తాజాగా టికెట్‌ కౌంటర్లపై ఆంక్షలు తొలగించింది. అలాగే రైళ్లలో ఫుడ్‌ సదుపాయంకు అనుమతి లభించింది.

Pollution Certificate: ఈ వాహనాలకు పోల్యూషన్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

Hanging Train: మీరు ఎప్పుడైనా పట్టాల కింద వేలాడుతూ నడిచే రైళ్లను చూశారా..? ఇదిగో మీ కోసం..!