Pollution Certificate: ఈ వాహనాలకు పోల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..!
Pollution Certificate: వాయు కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. దీపావళి పండగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పరిస్థితి మరింతదారుణంగా తయారైంది..
Pollution Certificate: వాయు కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. దీపావళి పండగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పరిస్థితి మరింతదారుణంగా తయారైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు కాలుష్యం కారణంగా గొంతు మంట, కళ్లల్లో నుంచి నీళ్లు రావడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనవసరమైన నిర్మాణాలను నిలిపివేయడం, రవాణా, పవర్ ప్లాంట్లను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే వాయు కాలుష్యాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వాహనాల పీయూసీ సర్టిఫికేట్‌లపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది. పోల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా పట్టుబడితే వాహన యజమానికి ఆరు నెలల జైలు శిక్షల ఏదా రూ.10,000 జరిమానా లేదా రెండు విధించవచ్చు.
PUC సర్టిఫికేట్ అంటే ఏమిటి: పీయూసీ (Pollution Under Control Certificate) సర్టిఫికేట్ కాలుష్య పరీక్షలకు సంబంధించినది. వాహనం నుంచి ఎంత కాలుష్యం వెలువడుతుందనేది ఈ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. వాహనానికి ఈ పీయూసీ పరీక్ష తర్వాతే వాహనానికి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ పరీక్ష ద్వారా ఏ వాహనం కాలుష్య స్థాయి ఎంత ఉందో తెలుపుతుంది. PUC సర్టిఫికెట్ అనేది వాహనాల కాలుష్య నియంత్రణ ప్రమాణాలను తెలియజేస్తుందని పొల్యూషన్ కంట్రోల్ స్టాండర్డ్స్ చెబుతోంది. ఈ సర్టిఫికేట్ నిర్దిష్ట కాలానికి చెల్లుబాటు అవుతుంది. వాహనం పీయూసీ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవచ్చు.
ఏ వాహనాలకు పీయూసీ అవసరం: టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ఈ పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం. ఇది దేశ వ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అన్ని పెట్రోల్ పంపుల వద్ద పీయూసీ సెంటర్లు అందుబాటులో ఉంటాయి.
పీయూసీ సర్టిఫికేట్‌లో ఏయే సమాచారం ఉంటుంది: పీయూసీ సర్టిఫికేట్‌లో వాహనం నెంబర్ ప్లేటు ఫోటో ఉంటుంది. అలాగే వాహనానికి కాలుష్య పరీక్షలు నిర్వహించిన తేదీ, సర్టిఫికేట్ గడువు తేదీ ఉంటుంది. అంతేకాకుండా పరీక్ష రీడింగ్‌లు, పరిశీలన తదితర వివరాలు ఉంటాయి.
ఈ వాహనాలకు పీయూసీ అవసరం లేదు: పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం. మీరు బ్యాటరీతో నడిచే కారు, ద్విచక్ర వాహనాలు, ఈ-రిక్షా లేదా, ఈ-స్కూటీని కలిగి ఉన్నట్లయితే పీయూసీ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఈ వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్ అడగరు.
ఇవి కూడా చదవండి: