Crime News: ఆర్టీసీ బస్‌లో ప్రేమ జంట ఆత్మహత్య.. విషం తాగి బలవన్మరణం..

Lovers Suicide: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప‌రిధిలోని అశ్వారావుపేట‌ ప్రాంతానికి చెందిన ప్రేమికులు

Crime News: ఆర్టీసీ బస్‌లో ప్రేమ జంట ఆత్మహత్య.. విషం తాగి బలవన్మరణం..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2021 | 8:18 PM

Lovers Suicide: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప‌రిధిలోని అశ్వారావుపేట‌ ప్రాంతానికి చెందిన ప్రేమికులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వారావుపేట బస్టాండ్‌లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సులో ప్రేమికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండ‌లం సీతాయిగూడెం గ్రామానికి చెందిన పొర్రొళ్ల జ‌గ్గారావు (28) ఆటో న‌డుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. ఇత‌నికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే గ్రామానికి చెందిన ప‌లువురు విద్యార్థులు జ‌గ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌కు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించేవారు. ఈ క్రమంలో జ‌గ్గారావు, ఓ విద్యార్థిని మ‌ధ్య ఏర్పడిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.

ఈ క్రమంలో మంగళవారం ఇద్దరూ కలిసి విషం తాగి కొత్తగూడెం బస్సెక్కారు. బస్సు పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చే సరికి.. ఇద్దరికి నురగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. దీంతో వారు అశ్వారావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బస్సులో.. ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించేసరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Gold Seized: లైఫ్ జాకెట్‌లో రూ. కోటి బంగారం దాచుకొని ఫ్లైట్ ఎక్కిన నిందితుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Challan Pending: మామూలోడు కాదు.. చలానాల చిట్టా చూసి అవాక్కైన ట్రాఫిక్‌ పోలీసులు..!