AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal Affair: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై మరదలిపై మోజు పడ్డాడు.. ఆమెను దక్కించుకోవడం కోసం చివరికి..

Illegal Affair: వివాహేతర సంబంధాలు బంధాలను విడదీయడే కాకుండా వ్యక్తుల ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కోడలు వరుసయ్యే యుతిపై మోజులో..

Illegal Affair: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై మరదలిపై మోజు పడ్డాడు.. ఆమెను దక్కించుకోవడం కోసం చివరికి..
Crime News
Shiva Prajapati
|

Updated on: Nov 16, 2021 | 10:14 PM

Share

Illegal Affair: వివాహేతర సంబంధాలు బంధాలను విడదీయడే కాకుండా వ్యక్తుల ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కోడలు వరుసయ్యే యుతిపై మోజులో తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు సన్నీ పాశ్వాన్, వర్ష కుమారి దంపతులు. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం తరువాత వర్ష తన పుట్టింట్లోనే ఉంటోంది. భర్త సన్నీ కూడా భార్య, అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. అయితే, సన్నీ తన భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ విషయం సన్నీ భార్య వర్షకు తెలిసింది. దాంతో వారి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే.. ఇకలాభం లేదనుకున్న సన్నీ తన భార్యను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడు.

ముందే వేసిన ప్లాన్ ప్రకారం.. భార్య వర్షను గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించాడు. వర్ష మృతదేహాన్ని పెట్టెలో కుక్కి పడేసే ప్రయత్నం చేశారు. అయితే, అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు.. సన్నీ, అతని ప్రియురాలు అక్కడి నుంచి పరారయ్యారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, వర్ష హత్యలో సన్నీతో పాటు మరికొందరి సహకారం కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..