Miryalaguda Road Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం.. లారీ ట్రావెల్స్ బస్సు ఢీ.. ముగ్గురు మృతి, పలువురు సీరియస్

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ హైవేపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.

Miryalaguda Road Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం.. లారీ ట్రావెల్స్ బస్సు ఢీ.. ముగ్గురు మృతి, పలువురు సీరియస్
Miryalaguda Bus Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 24, 2021 | 6:58 AM

Miryalaguda Bus Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ హైవేపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. రాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య 10 మంది దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.

కాగా, మృతులను మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా గుర్తించారు. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే లారీని ఢీకొట్టాడని తెలుస్తోంది. అంతకుముందు కూడా దాచేపల్లి దగ్గర ఓ ఆటోను ఢీకొట్టబోయి.. కొద్దిలో తప్పించాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రమత్తుతో ఉన్న డ్రైవర్‌ను అప్రమత్తం చేసినప్పటికీ.. అతను వినిపించుకోలేదని తెలిపారు. తాజాగా రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం తుక్కుతుక్కైంది. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also… Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!

Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌

Ramayanam: ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం.. రాముడిని ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏమిటో తెలుసా

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..