Ramayanam: ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం.. రాముడిని ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏమిటో తెలుసా
Ramayanam: రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా..
Ramayanam: రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. దీంతో లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు. అయితే లక్ష్మణుడు భార్య ఊర్మిళ రామాయణంలో ప్రముఖ పాత్ర. ఊర్మిళ జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితోపాటు ఊర్మిల కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంకాగా, తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు.
భర్త అరణ్య వాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రివేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో ‘తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని, అన్నావదినల సేవకోసం వచ్చిన తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని’ నిద్ర దేవతని వేడుకుంటాడు. నిద్ర దేవత అంగీకరించి ‘నిద్ర ప్రకృతి ధర్మమని, తన నిద్రను ఎవరికైనా పంచాలని’ కోరడంతో ‘తన పద్నాలుగేళ్ళ నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి, ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని’ లక్ష్మణుడు చెప్తాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది. ఈ 14 ఏళ్లను ఊర్మిళదేవి నిద్రగా పిలుస్తారు.
అయితే పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు ఊర్మిళా దేవితో మాట్లాడుతూ.. ”తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!” అన్నారట. రాములవారు.రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ”ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,” అని వేడుకుందట ఊర్మిళ.
”కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,” అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే.
Also Read: Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక