AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ప్రపంచంలో కత్తి కంటే నాలుక పదునైనది అంటున్న చాణక్య.. దానిని ఎలా ఉపయోగించాలంటే

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలకులు ప్రజలకు చేయాల్సిన మేలుని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ...

Chanakya Niti: ప్రపంచంలో కత్తి కంటే నాలుక పదునైనది అంటున్న చాణక్య.. దానిని ఎలా ఉపయోగించాలంటే
Chanakya Niti
Surya Kala
|

Updated on: Aug 24, 2021 | 6:51 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలకులు ప్రజలకు చేయాల్సిన మేలుని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. వాటిల్లో ఒకటి సమిష్టి కృషి..అందరు ప్రతిభా వంతులే. అయితే అవసరానికి అందరూ సమిష్టిగా కలిసి విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే వారి ప్రతిభ దాగి ఉంటుందని చాణక్య నీతి తెలియజేస్తుంది. నిన్న , నేడు రేపు ఎవరైనా సరే.. మనిషి ఏడు పొరపాట్లను చేయరాదని.. అవి జీవితంపై అత్యంత ప్రభావం చూపిస్తాయని తన శిష్యులకు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపాడు.. ఈ రోజు ఆ ఏడు ప్రశ్నలు, ఏడు పొరబాట్ల గురించి తెలుసుకుందాం..

ఓ సందర్భంలో చాణక్యుడికి అతని శిష్యపరివారానికి మధ్య ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. అవి ఏడు ప్రశ్నలు, ఏడు పొరబాట్లు గా కీర్తిగాంచాయి.

1 చాణక్యుడు తన శిష్యులను అతి పదునైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది అని అడగగా.. శిష్యులు చాలా తెలివిగా ఖడ్గం అని సమాధానం చెప్పారు.. దీనికి చాణక్యుడి సవరణ చేస్తూ.. ఈ ప్రపంచంలోనే అతి పదునైనది మానవుని నాలుక. అది చాలా సులువుగా ఇతరులను అనాలోచితంగా బాధించగలదు. అందుకే దాని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడాలని సూచించారు.

2. చాణక్యుడు రెండో ప్రశ్న.. ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా వున్నది ఏది? దీనికి శిష్యులు చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అని చెప్పారు.. శిష్యుల సమాధానాన్ని చాణుక్యుడు సవరిస్తూ.. అన్నిటికన్నా దూరంగా వున్నది గతం. కరిగిపోతున్నకాలం మనం ఎవరిమైనప్పటికీ, ఎంత శక్తివంతులమైనా కూడా మనము కాల చక్రంలో ముందుకు పోవడమే తప్పించి వెనుకను మరలలేము కదా. అందుకే వర్తమానమును సమృద్దిగా, బుద్దిగా ఉపయోగించుకొనేవాడు శ్రేష్ఠుడని తెలిపారు

3. చాణక్యుడు మూడో ప్రశ్న ప్రపంచంలోనే అతి పెద్ద పదార్ధం ఏదిని అడిగితె శిష్యులు పర్వతాలు, భూమి, సూర్యుడు అంటూ సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని సవరిస్తూ.. ప్రపంచంలో అతిపెద్ద పదార్ధం కోరిక అని చెప్పారు. ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో వున్న అన్నింటికన్నా పెద్ద పరిమాణంలో వుంటాయి. వాటిలోనే మునిగి తేలుతూ ఉంటారు. కోరికలు నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. కనుక అమిత ప్రభావం చూపే కోరికల పట్ల మితముగా మధ్యేమార్గంగా వ్యవహరించుట మంచిదని తెలిపారు.

4. చాణక్యుడు నాలుగో ప్రశ్న అత్యంత బలమైనది లేక బరువైనది ఏది అంటే.. శిష్యులు ఇనుము, ఏనుగు వంటి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాన్ని సవరిస్తూ.. ప్రపంచంలో బరువైనది, దృఢమైనది ప్రమాణం లేదా మాట. ఎవరికన్న చాలా సులువుగా ఇచ్చేయగలిగేది కాని నిలబెట్టుకోవడంలో కష్టతరమైనది.

5. చాణక్యుడు ఐదో ప్రశ్న ప్రపంచంలో అత్యంత చులకనైన గలది లేదా తేలికైనది ఏది అంటే వెంటనే శిష్యులు దుమ్ము, పత్తి, ఆకులు, గాలి అంటూ పలు సమాధానాలు చెప్పారు. వీటిని సవరిస్తూ.. చాణక్యుడి అన్నింటికన్నా తేలికైనది వినయం. అయితే దీనిని మనిషి ఎక్కువగా తమకి ఆపాదించుకోలేరు. తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహాన్ని ఆభరణముగా చేసుకుంటారు. కాని అది ఎవరికి ప్రయోజనకారి కాదు కదా.. అది దహించు అగ్ని వంటిదని తెలిపారు.

6. చాణక్యుడు ఐదో ప్రశ్న మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు? అంటే శిష్యులు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అంటూ సమాధానాలు చెప్పారు. వీటిని చాణక్యుడి సవరిస్తూ.. అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు. ఎందుకంటే మరణం తధ్యమైనది. అది ఏ క్షణమైనా మనకు కలుగవచ్చునని చెప్పారు చాణుక్యుడు

7. చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత సులువైన పని ఏది అంటే శిష్యులు వెంటనే నిద్ర, భోజనం, మాటామంతీ వంటివి సులువైనవి కావొచ్చు గురువుగారు అన్నారు. వీటిని చాణుక్యుడు సవరిస్తూ.. ఈ అమూల్యమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం కదా అన్నిటికన్న సులువైన పని. నలుగురిని మేల్కొలిపే ఈ సందేశాన్ని తెలుసుకున్న మీరు ఆ పని చేయకుండా వుండలేరని నాకు తెలుసు అన్నారు.

Also Read: Ramayanam: ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం.. రాముడిని ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏమిటో తెలుసా