Honey Trap: తియ్యని మాటను కమ్మగా విసిరి.. స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లి.. పాతాళంలో పడేస్తున్న కి‘లేడీ’లు
మిమ్మల్ని పీకల్లోతు ప్రేమలోకి దింపి...స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లి...దభాల్ను పాతాళంలో పడేసే కిలాడీలు చేసే మాయే హనీట్రాప్.
Honey Trap: పదహారూ ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.. అంటూ వెంపర్లాడే వయసది. మేం వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ 20ఏళ్లూ వ్యర్థం చేశాం.. అంటూ తుళ్లిపడే మనసు అది..అలాంటి వయసులో ఉన్న పిలకాయకు.. ఓ 16ఏళ్ల పడచు కొంటెగా నవ్వి.. కన్నుగీటి.. కాస్త మురిపంగా.. ఓ చూపు విసిరిందనుకోండి.. ఇక, అతగాడు భూమిమీద నిలుస్తాడా.. చదువు సంగతి దేవుడెరుగు.. తన ప్రాణాలను కూడా లెక్కచేయడు.. కానీ, అది నిజమైన ప్రేమకాదని.. తెలుసుకునే టైంకు అతని దగ్గర మనీ ఉండదు.. బతకాలనే ఆశా ఉండదు.. జీవచ్ఛవమై.. బతుకు భారమై.. ప్రాణాలు తీసుకునే సిట్చువేషన్ దాకా తీసుకెళ్తుంది.. ఇప్పుడదే జరిగింది. హనీట్రాప్.. ఇది పట్టణాల్లోనే ఉండి చచ్చేది.. ఇప్పుడు పల్లెలకూ పాకి పిల్లల ప్రాణాలనూ తీస్తోంది..
మిమ్మల్ని పీకల్లోతు ప్రేమలోకి దింపి…స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లి…దభాల్ను పాతాళంలో పడేసే కిలాడీలు చేసే మాయే హనీట్రాప్. వాళ్లు అందాల రాశులు కాదు గురూ….అందాల రాక్షసులు. వారి కంటికి చిక్కినా…వారి ఒంటికోసం తాపత్రయపడినా….మీ ఒళ్లు ఇళ్లు గుళ్ల చేస్తోంది. ఈమధ్య బాగా పాపులరైంది. ఇంతవరకు డబ్బు దోచుకోవడం వరకే ఆగింది…ఆమధ్య ఆ పాపి పాకిస్తాన్ మనదేశ రహస్యాలను తెలుసుకోవడం కోసం హనీట్రాప్ ప్లాన్ చేసింది..ఇప్పుడు అక్కడితే ఆగలే. మనుషుల ప్రాణాలు తీసేదాకా వచ్చింది. పట్నం వదిలి పల్లెలకూ ఈ దరిద్రం పాకింది…
వరంగల్ జిల్లాకు చెందిన సందీప్ అనే యువకుడిని ఈ హనీట్రాపే బలితీసుకుంది. రాయపర్తి మండలం మొరిపిరాలలో ఓ మాయలేడి మృతుడి చెల్లెలి బాల్యస్నేహాన్ని అడ్డంపెట్టుకుని లవ్ ఎపిసోడ్ నడిపింది. ఇక్కడ ఓ యువతి మూడు వేరువేరు ఫోన్ నెంబర్లతో ముగ్గురు యువతుల్లా సందీప్‌ను నమ్మించి వలపు వల విసిరింది. రకరకాల కట్టకథలు అల్లింది. తియ్యటి మాటలతో దగ్గరైంది. చనువుగా ఉన్న చిత్రాలను, రికార్డు చేసిన వ్యక్తిగత మాటలను అడ్డుగా పెట్టుకుని వేధింపులకు గురి చేసింది.. బెదిరింపులకు కూడా దిగింది.. చివరకు అతని ఆత్మహత్యకు కారకురాలయ్యింది. స్రవంతి.. కావ్య… మనీషా…ఈ మూడు పేర్లతో అబ్బాయిలతో సినిమా స్టైల్లో ఆడేసుకుంది. స్రవంతిగా కనిపించి.. కావ్య, మనీషాగా కనిపించకుండా నాటకం ఆడుతూ.. పాపం ఆ యువకుడ్ని ఆర్థికంగానూ, ఇటు మానసికంగా ఆడుకుని..చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఒక్కసందీప్ తోనే కాదు ఆకిలాడి లిస్ట్ లో చాలామంది అబ్బాయిలే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు..
కర్నూల్ లోనూ ఓ కిలేడీ సేమ్ ఇలాంటి గేమే ఆడింది. కాకుంటే..ఆ కిలాడి వెనుక..ఓపెద్ద గ్యాంగే ఉంది. ఆ యువతి వలపు మాటలకు పొంగిపోయిన ఓ యువకుడు, ఆమె ఏం చెబితే అది చేశాడు. చివరికి అర్థ నగ్న పోటోలు సైతం షేర్ చేశాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఫోటోలను అడ్డు పెట్టుకుని ఓ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి దండుకున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసింది. చివరకు పోలీసులు ఎంటర్ కావడంతో…ఆ యువతి చేసిన మోసాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి..
మొన్న హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఒక కుర్రాడు ఇలాగే.. అటు వైపు ఆమె టెంప్ట్ చేసింది కదాని.. ఇటువైపు ఇతడు టెంప్టయిపోయాడు.. ఆమె ఇతడి న్యూడ్ కాల్ మొత్తం రికార్డు చేసింది.. తర్వాత బ్లాక్ మెయిల్ కు దిగింది..దీంతో చేసేది లేక ప్రాణాలు తీసుకున్నాడు. ఇటు ముంబైలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ముంబై సెక్స్ టార్షన్ అనే గ్యాంగ్ ఒకటి.. బాలీవుడ్ సెలబ్రిటీల న్యూడ్ వీడియోలను ఇలాగే.. రికార్డ్ చేసింది. ఈ ట్రాప్ లో పడ్డ సంపన్న సెలబ్రిటీలకు వాళ్ల బొమ్మ వాళ్లకే చూపించి.. డబ్బు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ల టార్చర్ తట్టుకోలేక.. ముంబై సైబర్ సెల్ కి కంప్లయింట్ చేశారు బాధిత సెలబ్రిటీలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీళ్ల దగ్గరున్న బ్లూ ఫీడ్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 285 మంది నగ్న వీడియోలున్నాయందులో వంద మందికి పైగా బాలీవుడ్ సెలబ్రిటీలు ట్రాప్‌లో చిక్కుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
తియ్యగా మాట్లాడే అమ్మాయలందరూ మంచోళ్లు కాదు బుజ్జీ.. వాయిస్ టెంప్టింగ్ ఉండి.. కటౌట్ కంట్రోల్ తప్పేలా చేస్తూ.. మీ ప్రమేయంలేకుండానే పైపైన పడుతుంటే…మీరు మాత్రం పడకండే.. బేరం కుదిర్చి.. విషయం బెడ్ దాకా తీసుకెళ్లందంటే.. తర్వాత మీ బెండు తీసే ప్రోగ్రామ్ మాత్రం పక్కా.. సో.. ఇలాంటి భంచిక్ భంచిక్ వగలాడి వల్లో పడకుండా…కాస్త తమాయించుకోండే.