HCU Student Suicide: ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న..సెంట్రల్ యూనివర్సిటీలో PG స్టూడెంట్ మౌనిక సూసైడ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. తాను నివాసం ఉంటున్న హాస్టల్ గదిలోనే..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. తాను నివాసం ఉంటున్న హాస్టల్ గదిలోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె స్వస్థలం కరీంనగర్ జిల్లా శ్రీరాంపుర్. మౌనిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ నానో సైన్స్ కోర్సు M.tech (Nano science and Technology) రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటూ తల్లి దండ్రులకు ఓ లేఖ రాసింది. ఇందులో ఇలా ఉంది. ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ’ అని సూసైడ్ నోట్ రాసుకుంది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. మౌనిక స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామం. రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్.మౌనిక(27) HCUలో ఎంటెక్- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది.
క్యాంపస్‌లోని ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్-7లో ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి గదిలోంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పిలిచినా స్పందన లేదు. వెంటిలేటర్‌లోంచి చూడగా కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించడంతో ఈనెల 18వ తేదీన హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది. ఆమె తండ్రి లచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చదువుతోంది.
ఇవి కూడా చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?