TV Actor Found Dead Suspect: స్నేహితుడి ఇంట్లో శవమై కనిపించిన టీవీ నటుడు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..
Tamil TV Actor Indira Kumar: తమిళనాడుకు చెందిన టెలివిజన్ నటుడు ఇందిరా కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇవాళ చెన్నైలోని తన స్నేహితుడి నివాసంలో ఇందిరా..
TV Actor Found Dead Suspect: తమిళనాడుకు చెందిన టెలివిజన్ నటుడు ఇందిరా కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇవాళ చెన్నైలోని తన స్నేహితుడి నివాసంలో ఇందిరా కుమార్ విగత జీవుడై పడి ఉన్నాడు. పూర్తివివరాల్లోకెళితే.. టీవీ నటుడు ఇందిరా కుమార్ తన స్నేహితులను కలిసేందుకై చెన్నైకి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు కూడా వెళ్లాడు. అందరూ కలిసి సినిమా చూశారు. ఆ తరువాత రూమ్‌కి తిరిగి వచ్చాక.. ఇందిరా కుమార్ ఒక్కడే ఒంటరిగా రూమ్‌లోకి వెళ్లాడు. కాసేపటి తరువాత స్నేహితులు అతన్ని పిలువగా.. ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో వారు తలుపులను పగులగొట్టి చూడగా.. ఇందిరా కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఇందిరా కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇందిరా కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందిరా కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, అతని మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ గానీ, అతని మృతికి కారణాలేంటనేవి తెలియలేదు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. అతని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇందిరా కుమార్ పలు తమిళ టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు.
Also read:
ఎయిర్‌గన్‌తో యువకుడి హల్‌చల్.. ప్రేమిస్తున్నానంటూ యువతికి వేధింపులు.. ఆమె సోదరుడికి బెదిరింపులు..