AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నావ్ బాలికల హత్య కేసులో సంచలన నిజాలు.. ప్రేమ వ్యవహారమే కారణం.. విషపు నీళ్లు తాగించిన దుర్మార్గుడు..

Unnao Girls Death Case: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ముగ్గురు బాలికలు పొలంలో విష ప్రయోగానికి గురై తనువు చాలించిన సంగతి తెలిసందే.

ఉన్నావ్ బాలికల హత్య కేసులో సంచలన నిజాలు.. ప్రేమ వ్యవహారమే కారణం.. విషపు నీళ్లు తాగించిన దుర్మార్గుడు..
uppula Raju
|

Updated on: Feb 20, 2021 | 12:00 PM

Share

Unnao Girls Death Case: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ముగ్గురు బాలికలు పొలంలో విష ప్రయోగానికి గురై తనువు చాలించిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలతో తిరిగే మరో యువకుడే నిందితుడిగా తేలింది. ముగ్గురిలో ఇద్దరు చనిపోగా ఒకరు కాన్పూర్ ఆస్పత్రిలో విషమ పరిస్థితులలో చికిత్స పొందుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిందితుడు విజయ్ ఈ ముగ్గురు బాలికలకు లాక్‌డౌన్‌లో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్‌ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్‌ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో వినయ్‌ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్‌ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌ తీసుకుని బాలికల దగ్గరకు వెళ్లాడు.

రోజులానే నిందితుడు వినయ్‌, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్‌ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్‌, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు అక్కడ సిగరేట్‌ పీక, వాటర్‌ బాటిల్‌ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా వినయ్‌ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్‌ డీటెయిల్‌ రికార్డ్‌(సీడీఆర్‌) టెక్నిక్‌ ద్వారా వినయ్‌ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయండి.. ఈ మనుషుల మధ్య కన్నా జైళ్లోనే బెటర్.. యూకేలో ఓ యువకుడి విచిత్ర స్టోరీ..